Theaters Attack: కెనడాలో ఓ ఫిల్మ్ థియేటర్‌లో వారం రోజులుగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. పరిస్థితి గమనించిన థియేటర్ల యాజమాన్యాలు భారతీయ సినిమాల ప్రదర్శనను నిలిపివేశాయి. వాటిలో గురువారం థియేటర్లలోకి వచ్చిన కాంతారా-ఎ లెజెండ్ చాప్టర్ 1, పవన్ కళ్యాణ్ నటించిన ఓజి సినిమాలు ఉన్నాయి.
కెనడాలో థియేటర్లపై దాడులు
కారణాలు ఏమైనా కావచ్చు.. కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్‌లోని వారం రోజులుగా ఓ సినిమా థియేటర్ రెండు సందర్భాల్లో జరిగిన ఘటనలు కలకలం రేపుతున్నాయి. కాల్పులు, దాడులు మొదలుకావడంతో థియేటర్ల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో భారతీయ సినిమాల ప్రదర్శనను నిలిపి వేశాయి.
ఇటీవలకాలంలో కెనడాలో జరుగుతున్న ఘటనలు బెంబేలెత్తుతున్నాయి. దక్షిణాసియా సినిమాలను ప్రదర్శిస్తున్న నేపథ్యంలో మూవీ థియేటర్‌పై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలతో యాజమాన్యం అప్రమత్తమైంది. వెంటనే భారతీయ సినిమాల ప్రదర్శనను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.
భారతీయ సినిమాలకు బ్రేక్
సెప్టెంబర్ 25న ఇద్దరు వ్యక్తులు థియేటర్ ఎంట్రీ ద్వారానికి నిప్పు పెట్టేందుకు ప్రయత్నించారు. ఎర్రటి డబ్బాలతో మండే ద్రవాన్ని పోసి నిప్పుపెట్టారు. ఆ సమయంలో థియేటర్ మూసి ఉంది. అర్థరాత్రి ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
ALSO READ: ట్రంప్‌పై పుతిన్ ఆగ్రహం.. భారత్ తలొగ్గదని వ్యాఖ్య
ఈ ఘటనకు సంబంధించిన వీడియో థియేటర్ యాజమాన్యం అభిమానులతో షేర్ చేసుకుంది. భారతీయ సినిమాలు ప్రదర్శిస్తున్నందున తమపై గతంలో అనేకసార్లు దాడులు జరిగినట్టు చెప్పుకొచ్చారు. ఆ తరహా ఘటనలు తమను కలవరపెడుతున్నాయని పేర్కొన్నారు.
ప్రేక్షకులకు సురక్షితమైన వాతావరణంలో వినోదాన్ని అందించే మా ప్రయత్నాన్ని ఆపలేవన్నారు. వారం వ్యవధిలో కాల్పులు, దాడులు వంటి ఘటనల జరగడంతో యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. తదుపరి ప్రకటన వచ్చేవరకు భారతీయ చిత్రాల ప్రదర్శనను నిలిపి వేస్తున్నట్లు వెల్లడించింది.
రెండు సంఘటనలను లక్ష్యంగా చేసుకుని వేగంగా దర్యాప్తు చేస్తున్నట్లు హాల్టన్ పోలీసులు తెలిపారు. ఈ కేసులో ప్రజల సహాయం కోసం, అనుమానితుల వివరాల కోసం ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ని విడుదల చేశారు. గతంలో ఓక్‌విల్లేలోని ఓ ఆలయానికి ఖలిస్తానీ నుంచి బెదిరింపులు వచ్చినప్పటికీ ఈ కేసులో వారి ప్రమేయం గురించి ఎలాంటి నిర్ధారణ కాలేదని తెలుస్తోంది.
🚨 Cowardly Attack Fails: https://t.co/9TNzgavfeD Cinemas Remains Open and United 🚨
In the early hours of September 25, https://t.co/9TNzgavfeD Cinemas was the target of an attempted arson. Thankfully, no one was on site, and our theatre remains fully open and safe for guests.… pic.twitter.com/OL6BpkzOH7
— Film.Ca Cinemas (@FilmCaCinemas) September 25, 2025