అమరావతి మరో కీలక ఘట్టానికి వేదిక కానుంది. ఆర్థిక కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా మారనుంది. ఇవాళ 21 బ్యాంకులు, 3 ఇన్సూరెన్స్ సంస్థలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రులు లోకేశ్, నారాయణ హాజరుకానున్నారు.
పలాసలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్రగాయాలై ప్రస్తుతం పలాస ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గాయపడిన వ్యక్తి పరిస్థితి కూడా విషమంగా ఉంది.
తిరుమల శ్రీవారి ఆధ్యాత్మిక వైభవం వెల్లివిరిసేలా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు. ఆధ్యాత్మికం, అన్నదానం, విద్య, వైద్యానికి చిరునామాగా టీటీడీ ఉండాలని సీఎం ఆదేశించారు. వైకుంఠ ఏకాదశి దర్శనాలకు పటిష్టంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
మావోయిస్టు పార్టీ అగ్రనేతలు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ పోలీసుల అదుపులోనే ఉన్నట్లు మావోయిస్టులు లేఖ రిలీజ్ చేశారు. ఆయనతో పాటు మరో 50 మందిని అరెస్ట్ చేశారంటూ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ వికల్ప్ పేరిట విడుదలైన లేఖలో ప్రస్తావించారు. ఈనెల 18, 19 తేదీల్లో జరిగిన ఎన్‌కౌంటర్లు ఫేక్ అని..ఈ రెండు ఘటనల్లో హిడ్మా, ఆయన భాగస్వామి రాజే సహా 13 మంది మావోయిస్టులను చిత్రహింసలు పెట్టి చంపేశారని ఆరోపించారు.
అనంతపురం జిల్లాలోని శారదానగర్‌లో దారుణం చోటు చేసుకుంది. మూడేళ్ల కుమారుడి గొంతు కోసి తల్లి అమూల్య హత్య చేసింది. తర్వాత ఆమె కూడా ఫ్యాన్‌కి ఉరేసుకొని చనిపోయింది. దీంతో పోలీసులు కేసు విచారణ చేపట్టారు. అమూల్యను రామగిరి డిప్యూటీ తహసీల్దార్ రవి భార్యగా గుర్తించారు.
పరకామణి చోరీ వ్యవహారంలో సిట్ అధికారులు దర్యాప్తును స్పీడప్ చేశారు. ఇందులో భాగంగా ఇవాళ టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విచారణకు హాజరుకానున్నారు. ఇప్పటికే ఈ విషయంలో తనకేమీ తెలియదంటూ క్లారిటీ ఇచ్చారు టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. ఈ నేపథ్యంలో ఆయన్ను ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు.. ఆయన ఏం చెబుతారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ వ్యాప్తంగా జరగనున్న పంచాయతీ ఎన్నికలపై పోలీస్ డిపార్ట్మెంట్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. నిన్నటి నుంచి తొలివిడత ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించింది. ఇందులో భాగంగా డీజీపీ శివధర్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తన ప్రచార సరళిని పూర్తిగా మార్చింది. కేవలం రాష్ట్ర స్థాయి అంశాలపైనే ఆధారపడకుండా, నియోజకవర్గాల వారీగా ఉన్న క్షేత్రస్థాయి సమస్యలనే ప్రధాన అజెండాగా మార్చుకుంది. ఆరు గ్యారెంటీలనే బ్రహ్మాస్త్రంగా మలుచుకుంటూనే, స్థానిక అంశాలను జోడించి ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టేందుకు పక్కా ప్లాన్ సిద్ధం చేసింది.
శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. లట్టిగా జంక్షన్ దగ్గర తన కుమార్తెతో రోడ్డు దాటుతున్న సుదర్శన్ అనే వ్యక్తిని ఓ బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆయనతో పాటు బైక్‌పై ఉన్న మరో ముగ్గురికి కూడా తీవ్రగాయాలు అయ్యాయి.
సనత్‌నగర్‌లోని కల్పతరు రెసిడెన్సీలో విషాదం చోటుచేసుకుంది. దీపికా అనే యువతి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. 14వ అంతస్తు నుంచి కిందపడి చనిపోయిందని దీపిక చౌదరి తండ్రి చెబుతున్నాడు. దీపికది ఆత్మహత్య? హత్య అన్న డౌట్స్ వస్తున్నాయి. మరోవైపు ఆమె మృతిపై ఇప్పటి వరకు ఎవరూ కంప్లైంట్ ఇవ్వలేదన్నారు పోలీసులు.
సిద్దిపేట జిల్లా ఆకారం గ్రామ శివారులోని కూడవెళ్లి వాగు వద్ద చోరీ జరిగింది. వ్యవసాయ పొలాల వద్ద ఏర్పాటు చేసిన మోటార్లు, కేబుల్ వైర్లను ఎత్తుకెళ్లారు దుండగులు. పొలాలకు నీరు పెట్టడానికి వెళ్లిన రైతులు ఈ చోరీని గుర్తించి ఆందోళన చెందారు. దీనిపై రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విశాఖ గాయత్రి మెడికల్ కళాశాలలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహించారు. రెండు ప్రైవేట్ వాహనాలపై ఇద్దరు గన్ మెన్‌లతో మెడికల్ కాలేజీకి వచ్చిన నలుగురు ఈడీ అధికారులు తనిఖీలు చేశారు.
అయ్యప్ప మాల వేసుకున్న కంచన్ బాగ్ ఎస్సై కృష్ణకాంత్‌కు ఉన్నతాధికారులు మెమో జారీ చేయడంపై బీజేపీ నేత చీకోటి ప్రవీణ్ కుమార్ ఫైర్ అయ్యారు. పోలీసులు ఒక వర్గానికి చెందిన వారిని ఒకలా చూస్తూ హిందువులని మరోలా చూడడం తగదన్నారు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన పోలీస్ శాఖకే ఇలాంటి తప్పిదాలకు పాల్పడడం శోచనీయమన్నారు.
నంద్యాల జిల్లాలోని పత్తి కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. ఉదయం నుంచి రాత్రి వరకు పడిగాపులు కాస్తున్నా, సరుకు నాణ్యత లేదంటూ సీసీఐ అధికారులు పంటను తిరస్కరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు నుంచి కష్టపడి తెచ్చిన పంటను కొనుగోలు చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని రైతులు హెచ్చరించారు.
భారతదేశంలో చొరబాటుదారులు ఆధార్ కార్డులు సంపాదించడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. పౌరులు కాని వారికి ఆధార్ ఉన్నందున ఓటు హక్కు కూడా ఇవ్వాలా అని ప్రశ్నించింది. పౌరసత్వానికి ఆధార్ రుజువు కాదు అని స్పష్టం చేస్తూ, సంక్షేమ ప్రయోజనాల కోసమే దీన్ని ఏర్పాటు చేశారని కోర్టు పేర్కొంది.
ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రతిపాదించిన 28 పాయింట్ల శాంతి ప్రణాళికపై వివాదం రేగుతోంది. అది ట్రంప్ తయారుచేసింది కాదని.. రష్యా రచించిన డాక్యుమెంట్ అని వివిధ వర్గాలను ఉటంకిస్తూ రైటర్స్ వెలువరించిన కథనం కలకలం రేపుతోంది.
హాంకాంగ్‌లోని బహుళ అంతస్తుల భవన సముదాయంలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటివరకు ఈ ఘటనలో మృతుల సంఖ్య 94కి చేరగా 76 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేశారు.
అహ్మదాబాద్‌కు 2030 కామన్వెల్త్ క్రీడల ఆతిథ్య హక్కులు అధికారికంగా దక్కాయి. గతంలో 2010లో ఢిల్లీ ఆతిథ్యమిచ్చింది. 2030 క్రీడలను సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ స్పోర్ట్స్ ఎన్‌క్లేవ్‌లో అక్టోబర్‌లో నిర్వహించాలని భారత్ యోచిస్తోంది. ఈ విజయం 2036 ఒలింపిక్స్ నిర్వహించాలన్న భారత్ సంకల్పానికి బలాన్ని చేకూర్చింది.
అహ్మదాబాద్ వేదికగా
నటి హేమమాలిని భర్త ధర్మేంద్ర ఇటీవల తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం తనకు తీరని లోటని హేమ మాలిని ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. నా జీవితంలో అన్నీ ధర్మేంద్రనే.. భార్యను అమితంగా ప్రేమించే భర్త, పిల్లల్ని బాధ్యతగా చూసుకునే తండ్రి.. ఇలా అన్నీ ఆయనే” అని అన్నారు హేమమాలిని.
అగ్రహీరో నాగార్జున కెరీర్‌లో కల్ట్ క్లాసిక్ హిట్‌గా నిలిచిపోయిన చిత్రాలు శివ, గీతాంజలి. ఇప్పుడీ విజయవంతమైన సినిమాల్ని గోవా వేదికగా ఘనంగా జరుగుతోన్న 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలో ప్రత్యేకంగా ప్రదర్శించారు. శివ చిత్రం చూసినప్పుడు 36ఏళ్ల నాటి సినిమా అని అనుకోరని నాగార్జున అన్నారు.