E-Paper
Advertisement

Temple Height : ఆలయ గోపురం ఎత్తుగా ఉండాలి లేకపోతే…

Temple Height : ఆలయ గోపురం ఎత్తుగా ఉండాలి లేకపోతే…
Advertisement

Temple Height : దేవాలయం అంటే లక్షలాది భక్తుల పుణ్యధామం. ఆగమశాస్త్రబద్ధంగా దేవాలయాలను నిర్మించాల్సి ఉంటుంది. ఆలయ గోపురమే భగవంతుని పాదాలు.గర్భగుడి భగవంతుని శిరస్సు. ఆలయమంటపం భగువంతుని కడుపు. దైవదర్శనం అంటే గుడిలోకి వెళ్లి స్వామిని చూచి గంట కొట్టి నమస్కరించాలని అనుకుంటాం. ఆ పద్ధతినే పాటిస్తున్నాం. కానీ దూరంగా ఉండి కూడా ఆలయ గోపురానికి నమస్కరించినా స్వామి పాదాలకు నమస్కరించనట్టే అవుతుంది. కాబట్టే ఆలయ గోపురం ఎత్తుగా ఉండాలి.

అంతేకాకుండా దేవాలయం ఒక వ్యక్తికి , ఒక కుటుంబానికి సంబధించి ఉందు. సార్వజనిక ఆస్తిగా పరిగణించబడుతూ , పోషింపబడుతూ, రక్షింపబడుతూ ఉండాలి. దాతలెవరైనా దేవాలయానికి దానిదికాలు చేయవచ్చు. పోషకులగా ఉండవచ్చు. గతంలో వేశ్యలు కూడా దేవాలయాలను కట్టించిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. సర్వజనానికీ, పొరుగు ఊరి వారికి పరదేశీయులకు, కొత్తగా వచ్చిన వారికీ దేవాలయం ఎక్కడ ఉందో సులభంగా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది

Advertisement

దేవాలయ గోపురమే కాదు దేవాలయం కూడా ఎత్తులో ఉండటం ఎంతో హితదాయకం. అందుకే కొన్ని దేవాలయాలను గుట్టలను, కొండలను చూసి మరీ నిర్మిస్తారు. వరద బీభత్సాలు, తుఫానులు, మొదలైన ప్రకృతి విపత్తులకు మనిషి భయపడి తీరాల్సిందే. అటువంటి ప్రళయ సమయాల్లో ప్రాణాలు కాపాడగలిగిన స్థలం దేవాలయమే. మానవుడు ఎంతటి తెలివితేటలు కలవాడైనా సరే ప్రకృతిని జయించగల శక్తిమంతుడు కాలేడు. కాడు.

ఈసర్వోన్నత భావం దేవాలయాన్ని దర్శించిన ప్రతీసారి మనిషికి, మనస్సుకీ బోధపడటానికి దేవాలయాల గోపురాన్నీ ఎంత వీలైతే అంత ఎత్తుగా నిర్మిస్తారు. దేవుడు గొప్పవాడు, అని చెప్పటం కోసమే ఆలయ గోపురం చాలా ఎత్తుగా నిర్మిస్తారు.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×