BigTV English

Sandals : ఇంటి ముందు చెప్పులు ఏ దిశలో ఉంచాలి

Sandals : ఇంటి ముందు చెప్పులు ఏ దిశలో ఉంచాలి

Sandals : ఎవరైనా ఇంటికి వెళ్లినా, గుడికి వెళ్లినా చెప్పులు బయట విడిచి రావాలన్న బోర్డులు కనిస్తుంటాయి. బయటి నుంచి వచ్చే వాళ్ల రకరకాల సమస్యలు, ఆలోచనల ప్రభావం మనస్సు మీద పడుతుంది.
అందుకే దేవాలయాల్లోను, గృహాల్లోను చెప్పుల బయటి వదిలి రావాలంటారు. అంటే అహాన్ని, కోపాన్ని, సమస్యల్ని వదిలి లోపాలకి రావాలి అని చెప్పడన్నమాట. అందుకే బయట నుంచి రాగానే చెప్పులు బయటే విడవాలి


కానీ వాస్తుశాస్త్ర రిత్యా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. సింహద్వారం ఎదురుగా చెప్పులు విడవకూడదు. సింహద్వారం అంటే సాక్షాత్తూ లక్ష్మీస్వరూపం . సింహద్వారం ఎదురుగా విడిస్తే లక్ష్మీదేవీ ఆగ్రహిస్తుంది. కాబట్టి ఎవరైనా సరే చెప్పులు సింహద్వారం ముందు విడిచి లోపలికి పోకూడదు. చెప్పులు స్టాండ్ ఎక్కడుందో చూసి అక్కడ విడిచి రావాలి.
అది పిల్లలైనా సరే ఈ పద్ధతి పాటించేలా చూసుకోవాలి. ఇలాచేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది.
ఇలాంటి నియమం వెనుక మరోకారణం ఉంది. మనం బయటకి రకరకాల చోట్లకి తిరిగి వస్తాం. కనుక వాటితో పాటు నెగటివ్‌ ఎనర్జి ఖచ్చితంగా ఉంటుందని, వాటిని ఇంట్లోకి తీసుకు రాకుండా ఎంత దూరంలో ఉంచితే అంత మంచిది అంటూ పండితులు చెబుతున్నారు.
అలా వచ్చినప్పుడు చెప్పులతోపాటు వందలాది సూక్ష్మ క్రిములు కూడా వస్తుంటాయి. దీని వల్ల అనారోగ్య సమస్యలుకూడా వచ్చే ఆస్కారం ఉంది. అందుకే చెప్పులు బయటే విడిచిరావాలంటారు.

ఈ ఆచారం పెట్టడానికి కారణం ఇదే. గతంలో ఈశాన్యం మూల చెంబు, బకెట్టుతో నీళ్లు ఉంచే వారు. బయట నుంచి వచ్చే వాళ్లు అక్కడే చెప్పులు విడిచి కాళ్లు కడుక్కుని ఇంట్లో వెళ్లే పద్ధతిని పాటించే వారు.
చెప్పులు కూడా ఒక సరైన దిశలోనే ఉంచాలి. మెయిన్ డోర్ పక్కనే చెప్పులు స్టాండ్ ఉంచకూడదు. ప్రధాన ద్వారానికి 2,3 అడుగుల దూరంలో ఉంచాలి. చెప్పుల స్టాండ్, పశ్చిమ, నైరుతి దిశల్లో ఉంచడం శ్రేయస్కరం. ఎట్టిపరిస్థితుల్లోను ఉత్తరం, ఆగ్నేయం, తూర్పు దిశలో ఉంచకూడదు.


Tags

Related News

Garuda Puranam: ఆ పనులు చేస్తే మనిషి ఆయుష్షు తగ్గిపోతుందట – అసలు గరుడపురాణం ఏం  చెప్తుందంటే..?

Hinduism – Science: సైన్స్ ను సవాలు చేసిన హిందుత్వం –  అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు

New Home Vastu: కొత్త ఇల్లు కొంటున్నారా ? ఈ వాస్తు నియమాలు చెక్ చేయండి, లేకపోతే అంతే సంగతి !

Chanakya Niti: చాణక్య నీతి: కుటుంబ పెద్ద ఆ ఒక్క పని చేస్తే చాలు – ఆ ఇల్లు బంగారంతో నిండిపోతుందట

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ దాచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Big Stories

×