Big Stories

Principle of Banks : బ్యాంకుల వ్యాపార సూత్రం ఇదే..!

Principle of Banks

Principle of Banks : మనం తరుచుగా రెపో రేటు మరియు రివర్స్ రెపో రేటు అనే పదాలు వింటూ ఉంటాం. అయితే.. బ్యాంకుల మనుగడ, లాభనష్టాలను నిర్దేశించే.. ఈ పదాల అర్థాలు మాత్రం మనలో చాలామందికి తెలియదు. అదేంటో తెలుసుకుందాం.

- Advertisement -

మనదేశంలోని బ్యాంకులన్నీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో పనిచేస్తాయి. ఒకరకంగా చెప్పాలంటే.. దేశంలోని బ్యాంకులన్నింటికీ.. ఇది అమ్మలాంటిది. రిజర్వ్ బ్యాంకు.. దేశంలోని బ్యాంకుల వాణిజ్య కార్యకలాపాలకు అవసరమైన డబ్బును సరఫరా చేస్తుంది.

- Advertisement -

దీనికోసం.. బ్యాంకులు తమ వద్ద ఉన్న సెక్యూరిటీ డిపాజిట్లను, బాండ్లను తాకట్టు పెట్టి తమకు కావలసిన మొత్తాన్ని రిజర్వ్ బ్యాంకు నుంచి వడ్డీకి తెచ్చుకుంటాయి. ఈ అప్పుమీద రిజర్వ్ బ్యాంకు ఆయా బ్యాంకుల నుంచి వసూలు చేసే వడ్డీనే ‘రెపో రేటు’ అంటారు. దీనినే స్వల్పకాలిక వడ్డీ రేటు అనీ అంటారు. దేశంలో ఆర్ధిక పరిస్ధితిని బట్టి.. ఆర్బీఐ దీనిని నిర్ణయిస్తుంది.

దేశంలో ఆర్థిక వ్యవస్థ బలహీన పడినప్పుడు.. ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుంది. ఈ పరిస్థితిలో రిజర్వ్ బ్యాంకు తక్కువ వడ్డీకే బ్యాంకులకు మరింత మొత్తాన్ని అప్పుగా ఇస్తుంది. ఈ డబ్బును బ్యాంకులు.. కస్టమర్లకు తక్కువ వడ్డీకే అప్పులిస్తాయి. దీనివల్ల మార్కెట్లో డబ్బు సర్క్యులేషన్‌ పెరిగి, ఆర్థిక వ్యవస్థకు కొంత ఊతం అందుతుంది.

అలాగే.. ద్రవ్యోల్బణం పెరిగిన సందర్భాల్లో ప్రజల కొనుగోలును తగ్గించడానికి రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు పెంచి, బ్యాంకులు ఇచ్చే రుణాలను తగ్గించే ప్రయత్నం చేస్తుంది. దీనివల్ల ప్రజల మధ్య తిరిగే డబ్బు తగ్గిపోయి కొంతమేర ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుంది.

‘రివర్స్ రెపో రేటు’ అంటే.. రెపో రేటుకు వ్యతిరేకమైన వడ్డీరేటు. అంటే.. బ్యాంకులు తమ వద్ద అదనంగా ఉన్న డబ్బును రిజర్వ్ బ్యాంకు వద్ద డిపాజిట్ల రూపంలో దాచుకుంటాయి. ఈ డబ్బు మీద రిజర్వ్ బ్యాంకు ఆయా బ్యాంకులకు ఇచ్చే వడ్డీనే ‘రివర్స్ రెపో రేటు’ అంటారు. ఈ వడ్డీరేటు.. బ్యాంకుల నుంచి తాను వసూలు చేసే దానికంటే ఎక్కువగా ఉంటుంది.

ఉదాహరణకు రిజర్వ్ బ్యాంకు .. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు లక్ష కోట్ల అప్పును.. 5% వడ్డీకి (రెపోరేటు) ఇచ్చిందనుకోండి. ఆ మొత్తాన్ని తెచ్చి, ఎస్బీఐ తన కస్టమర్లకు 7% లేదా అంతకంటే ఎక్కువ వడ్డీకి అప్పులిచ్చి లాభాలను ఆర్జిస్తుంది. ఇలా వచ్చిన లాభాన్ని తిరిగి రిజర్వ్ బ్యాంకు వద్ద డిపాజిట్‌గా పెట్టి.. దానిపై తాను తీసుకున్న 5% కంటే ఎక్కువ వడ్డీని పొందుతుంది. అంటే.. బ్యాంకులు తక్కువ వడ్డీకి డబ్బు తెచ్చుకుని ఎక్కువ వడ్డీకి తిప్పుకోవటం, ఆ లాభాన్ని మళ్లీ ఎక్కువ వడ్డీకి రిజర్వ్ బ్యాంకు వద్ద డిపాజిట్ చేసి పొందుతాయి. బ్యాంకుల ఆదాయానికి, లాభాలకు ఈ వడ్డీ రేటులోని తేడాయే కారణం.

దేశంలోని ఆర్థిక వ్యవస్థ పనితీరును బట్టి రిజర్వ్ బ్యాంకు ఎప్పటికప్పడు ఈ వడ్డీ రేట్లను తగ్గించటం, పెంచటం చేస్తుంటుంది. 2011కు ముందు రివర్స్ రెపో రేటు శాతాన్ని… రెపో రేటుకు సంబంధం లేకుండా నిర్ణయించేవారు. కానీ.. ఆ తర్వాత ద్రవ్య పరపతి సమీక్ష జరిగి, ఆర్బీఐ రెపో రేటును మార్చినప్పుడల్లా.. రివ‌ర్స్ రెపో రేటు కంటే రెపో రేటు కనీసం 1 శాతం తక్కువగా ఉండేలా ప్రస్తుతం నిర్ణయిస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News