Big Stories

BRS NandaKishore Vyas : డబ్బులు పంచుతూ పోలీసులకు చిక్కిన BRS అభ్యర్థి

Share this post with your friends

BRS NandaKishore Vyas : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగియడంతో ఇక ప్రలోభాల పర్వం మొదలైంది. ప్రతి నియోజకవర్గంలో డబ్బులు పంపిణీ జరుగుతోందని సమాచారం అందుతోంది. పోలీసులు కూడా ప్రతి చోటా నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో మంగళవారం అర్ధరాత్రి గోషామహల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి నందకిషోర్ వ్యాస్ ఓటర్లకు డబ్బులు పంచుతూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

నందకిషోర్ వ్యాస్ చేతి నుంచి పోలీసులు డబ్బులు ఉన్న కవర్‌ను లాక్కున్నారు. దీంతో బీఆర్ఎస్ నేత నందకిషోర్ వ్యాస్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆ తరువాత పోలీసులు పెట్రోలింగ్ వాహనంలో ఆయనను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.

ఈ ఘటనకు సంబంధించి సోషట్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పోలీసులు.. నందకిషోర్ వ్యాస్ చేతినుంచి డబ్బుల కవర్ లాగేసుకుంటున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Latest News