Home remedies: మన ఆరోగ్యానికి ఊపిరితిత్తులు ఎంత అవసరమో అందరికీ తెలిసిందే. కానీ నేటి కాలంలో వాతావరణ కాలుష్యం, ధూళి, బాక్టీరియా, వైరస్‌లు వంటి కారణాల వల్ల ఇవి తరచూ సమస్యలు ఎదుర్కొంటాయి. దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడ, శ్వాసలో ఇబ్బంది వంటి సమస్యలు వస్తే, మందులకే పరిమితం కావలసి వస్తుంది. దీనికి మన ఇంట్లోనే లభించే ప్రకృతి సిద్ధమైన పదార్థాలతో ఒక అద్భుతమైన ఆరోగ్య కషాయం తయారు చేసుకోవచ్చు.
ఈ కషాయం ఊపిరితిత్తులలో పేరుకుపోయిన ధూళి, బాక్టీరియా, వైరస్‌లను శుభ్రం చేసి మన ఊపిరితిత్తుల వరకు గాలి వెళ్లే మార్గాలను పరిశుభ్రంగా ఉంచుతుంది. జలుబు, దగ్గు, సైనసిటిస్ వంటి సమస్యలకు ఉపశమనం ఇస్తుంది. దీన్ని తయారు చేసుకోవడం చాలా సులభం. ముందుగా ఒక గిన్నెలో రెండు లీటర్ల నీటిని తీసుకుని స్టవ్ మీద పెట్టండి.. ఆ నీరు మరుగుతున్నప్పుడు అందులో ఒక ముక్క ఉల్లిపాయ, మూడు వెల్లుల్లి రెబ్బలు, ఒక నిమ్మకాయను తీసుకుని దానిని ఒక సన్నని ముక్కను కోసి, కొన్ని అల్లం ముక్కలు, ఒక దాల్చిన చెక్క ముక్క వేసి పది నిమిషాలు బాగా మరిగించాలి. మరిగిన తర్వాత ఆ గిన్నెను కిందికి దించి మరిగిన నీటిని కొంచెం చల్లార్చాలి, గోరువెచ్చగా వున్న ఈ నీటిని తేనె కలిపి తాగాలి. తాగిన తరువాత కాస్త ఉపసమనం లభిస్తుంది.
ఉల్లిపాయలోని సహజ యాంటీ ఆక్సిడెంట్లు, వెల్లుల్లిలోని యాంటీ బాక్టీరియల్ గుణాలు, అల్లం ఇచ్చే వేడి, నిమ్మకాయలోని విటమిన్ C కలిసి ఈ పానీయాన్ని మరింత ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి. తేనె రుచితో పాటు గొంతుకు ఉపశమనం ఇస్తుంది. రోజుకు ఒకటి లేదా రెండు సార్లు తాగితే శరీరంలో ఉన్న అవాంఛిత పదార్థాలు సహజ ప్రక్రియలో బయటికి వెళ్లి శరీరం తేలికగా అనిపిస్తుంది. అయితే గర్భిణీలు, చిన్నపిల్లలు, లేదా ఇప్పటికే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఈ కషాయం తాగే ముందు తప్పనిసరిగా వైద్యుడి సలహా తీసుకోవడం మంచిది. ఇంకా, శ్వాస తీసుకోవడం, గాలి పీల్చుకోవడం ఇబ్బందిగా ఉంటే, ఊపిరి ఆడకపోతే లేదా మూడు రోజులలోపల కూడా పరిస్థితి మెరుగుపడకపోతే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.