BigTV English

Betting On Telangana Elections : కామారెడ్డి, గజ్వేల్, సిరిసిల్ల ప్రజల తీర్పేంటి? ఏపీలో జోరుగా పందేలు..

Betting On Telangana Elections : కామారెడ్డి, గజ్వేల్, సిరిసిల్ల ప్రజల తీర్పేంటి? ఏపీలో జోరుగా పందేలు..
Betting on Telangana elections

Betting On Telangana Elections : తెలంగాణ ఎన్నికలపై ఏపీలో జోరుగా బెట్టింగ్‌లు నడుస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ గెలుస్తుందంటూ భారీగా బెట్టింగ్‌లు కడుతున్నారు. కాంగ్రెస్‌పై బెట్‌ చేయాలంటే.. బీఆర్ఎస్‌ కంటే పదిరేట్లు ఎక్కువ చెల్లించాల్సిందే. ఇదంతా కూడా వాట్సాప్‌ల ద్వారానే సాగిపోతోంది. గూగుల్‌పే, ఫోన్‌పేతో ట్రాన్సక్షన్స్‌ చేస్తున్నారు. వందలకోట్లలో బెట్టింగ్‌లు జరుగుతున్నాయి.


హైదరాబాద్‌లో ఉన్నవారికి ఫోన్లు చేసి మరీ ఏ పార్టీ గెలుస్తుందో బెట్టింగ్‌ రాయుళ్లు ఆరా తీస్తున్నారు. ప్రత్యేకించి కోడిపందేలాకు ఫేమస్‌ అయిన గోదావరి జిల్లాల్లోనే ఎన్నికల బెట్టింగ్‌ దందా జోరుగా నడుస్తోంది. కృష్ణా, గుంటూరు, నెల్లూరు, కర్నూలు ప్రాంతాల్లోనూ బెట్‌లు నడుస్తున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో పాటు.. నియోజకవర్గాలవారీగానూ బెట్టింగ్‌ దందా కొనసాగుతోంది.

కామారెడ్డిలో రేవంత్‌ గెలుస్తారా..? లేక కేసీఆర్‌ గెలుస్తారా..? గజ్వేల్‌లో ఓటర్లు పట్టం కట్టేది ఎవరికీ..? ఈటలకా..? లేక కేసీఆర్‌కా? అని బెట్టింగ్‌లు నడుస్తున్నాయి. ఇక సిరిసిల్లలో కేటీఆర్‌పై కేకే మహేందర్‌రెడ్డి విజయం సాధిస్తారా? అనే దానిపైనా బెట్‌లు వేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారీ భారీ ఎత్తున బెట్టింగ్‌లు జరుగుతుండటంతో తెలంగాణ ఎన్నికలకు ప్రాధాన్యత ఏర్పడింది. బెట్టింగ్‌లు పెట్టడం కోసం కొందరు ఆస్తులు అమ్మి మరీ పెట్టుబడి పెడుతున్నారు. అదేటైంలో ఎక్కడా ఓడిపోతామోననే భయం వారిలో కనిపిస్తోంది. చివరికీ పోలింగ్‌ 80శాతం దాటుతుందా లేదా.. పర్సెంటేజ్‌పైనా బెట్‌లు కడుతున్నారు.


.

.

.

Related News

Helicopter ambulance: ఏపీలో హెలికాఫ్టర్ అంబులెన్స్ వస్తోంది.. అంతా ఉచితమే.. సర్వీస్ ఎలాగంటే?

Pulivendula Slips: బ్యాలెట్ బాక్స్ లో ఓటుతోపాటు స్లిప్పులు కూడా.. పులివెందుల ఓటర్ల మనోగతం ఏంటంటే?

AP Heavy Rains: ఏపీని ముంచెత్తిన భారీ వరదలు.. కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు

Polavaram: పోలవరంపై కీలక అప్ డేట్.. మంత్రి లోకేష్ ఆసక్తికర ట్వీట్

Fact Check AP: అడ్డంగా ఇరుక్కున్న అంబటి? బిగ్ షాకిచ్చిన fact check!

AP Heavy rain alert: అల్పపీడనం ఆగ్రహం.. మూడు రోజులు భీకర గాలులు, జోరు వర్షాలు.. ఎక్కడంటే?

Big Stories

×