OTT Movie : రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ఒక స్పైన్-చిల్లింగ్ థ్రిల్ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా హిందీ చిత్రాలైన డర్, అంజామ్ లాంటి నాస్టాల్జిక్ వైబ్‌ను కలిగి ఉంది. అద్భుతమైన నటన, వేగవంతమైన స్క్రీన్‌ప్లే ద్వారా ఈ సినిమా ఆకట్టుకుంటోంది. ఒక కార్పొరేట్ మహిళ, ఒక రాత్రి తన ఆఫీసులో చిక్కుకుని, ఒక సైకో స్టాకర్ నుండి తప్పించుకోవడానికి పోరాడే సన్నివేశాల చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ….
స్టోరీలోకి వెళ్తే
సత్య ప్రభాకర్ (రకుల్ ప్రీత్ సింగ్), ఒక సక్సెస్‌ఫుల్ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్, తన ఫియాన్సీ విశాల్ కపూర్ (అక్షయ్ ఒబెరాయ్)తో కలిసి దీపావళి సెలవుల కోసం ఢిల్లీకి విమానంలో వెళ్లేందుకు సిద్ధమవుతుంది. విమానం ఎక్కేందుకు ఆమె ఆఫీసు నుండి బయటకు వెళ్లడానికి ప్రయత్నించినప్పుడు, ఆమె ఆఫీసు భవనంలో ఎవరో వెంబడిస్తున్నట్లు గ్రహిస్తుంది. కానీ చుట్టూ ఎవరూ ఉండరు. భయాందోళనలో ఉన్న సత్య, తన సహోద్యోగి, టెక్నికల్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే రిషభ్ ఒబెరాయ్ ని సహాయం కోసం పిలుస్తుంది. రిషభ్ సహాయం చేయడానికి వచ్చినప్పుడు, అక్కడ ఒక డెడ్ బాడీని చూసి కంగారుపడతారు. కథ ముందుకు సాగుతున్నప్పుడు, సత్యకు రిషభ్ కి తనపై ఉన్న అనారోగ్యకరమైన అబ్సెషన్ తెలుస్తాయి.
Read Also : ప్రాణంగా ప్రేమించిన వాడే కసాయిగా మారితే… హీరోనే విలన్… జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన మూవీ
ఆమె ఇప్పుడు ఒక భయంకరమైన ప్రమాదంలో పడుతుంది. రిషభ్, సత్యను ఆఫీసులో బంధిస్తూ, తన ప్రేమను వ్యక్తపరుస్తూ, ఆమెను బలవంతంగా తనతో ఉంచుకోవాలని ప్లాన్ చేస్తాడు. ఈ క్రమంలో అతను హింసాత్మకంగా మారతాడు. సత్య తన ధైర్యం, తెలివితేటలను ఉపయోగించి, అతని నుండి తప్పించుకోవడానికి పోరాడుతుంది. అయితే ఆఫీసులో జరిగే హత్యలు, భయంకరమైన సంఘటనలకు ఆమె భయపడిపోతుంది. ఆమె విశాల్‌తో తిరిగి కలవాలనే ఆశతో, సత్య తన సర్వైవల్ ఇన్‌స్టింక్ట్‌ను ఉపయోగించి, రిషభ్ ను ఎదుర్కొంటుంది. ఇక క్లైమాక్స్ లో ఈ సినిమా ఒక ఊహించని ట్విస్ట్‌తో ముగుస్తుంది. రిషభ్ నుంచి ఆమె బయటపడగలుగుతుందా ? అతని చేతిలో బలవుతుందా ? అనేది ఈ సినిమాని చూసి తెలుసుకోండి.
జియో హాట్ స్టార్ లో
‘ఐ లవ్ యూ’ (I Love You) నిఖిల్ మహాజన్ దర్శకత్వం వహించిన హిందీ రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం. ఇది జియో స్టూడియోస్ బ్యానర్‌లో నిర్మితమైంది. రకుల్ ప్రీత్ సింగ్, పవైల్ గులాటీ, అక్షయ్ ఒబెరాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా, 2007 అమెరికన్ హారర్ డ్రామా P2 నుండి స్ఫూర్తి పొందింది. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్, పవైల్ గులాటీ, అక్షయ్ ఒబెరాయ్, కిరణ్ కుమార్, ప్రతీక్ పచౌరీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది జియో హాట్ స్టార్ లో 2023 జూన్ 16న విడుదలైంది. IMDbలో ఈసినిమాకి 5.4/10 రేటింగ్ ఉంది.