Big Stories

ED raids: నిన్న గంగుల.. ఇవాళ రవిచంద్ర.. మరి, రేపు ఎవరు..?

ED raids: ఈడీ దూకుడు మామూలుగా లేదు. తగ్గేదేలే.. వదిలేదేలే అనేలా వెంటాడుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కాం తర్వాత.. తెలంగాణ గ్రానైట్ కంపెనీలపై పంజా విసిరింది ఈడీ. హవాలా పద్దతిలో మనీలాండరింగ్ జరిగిందంటూ.. వరుసగా గ్రానైట్ సంస్థలపై దాడులు చేస్తోంది. బుధవారం మంత్రి గంగుల కమలాకర్ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేయగా.. గురువారం టీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తనిఖీలు నిర్వహించింది. హైదరాబాద్‌ శ్రీనగర్‌ కాలనీలోని ఆయన ఇంట్లో గురువారం ఉదయం నుంచి ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. గంగుల కమలాకర్ మాదిరే రవిచంద్ర సైతం తెలంగాణలో ప్రముఖ గ్రానైట్ వ్యాపారి.

- Advertisement -

లిక్కర్, గ్రానైట్.. అనేవి కేవలం సాకు మాత్రమేనని.. ఇదంతా తెలంగాణ సర్కారును భయభ్రాంతులకు గురి చేసేందుకేనంటూ టీఆర్ఎస్ వర్గాలు మండిపడుతున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి స్కాంలు లేవా? కేవలం ప్రతిపక్ష ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో మాత్రమే ఈడీ, సీబీఐ దాడులు ఎందుకు జరుగుతున్నాయనేది గులాబీ ప్రశ్న. తప్పేంటి?, అక్రమాలకు పాల్పడితే దాడులు చేస్తే తప్పేంటి? అనేది కమలనాథులు ఇస్తున్న జవాబు. కారణం ఏదైనా.. టార్గెట్ మాత్రం తెలంగాణ-కేసీఆరే అంటున్నారు.

- Advertisement -

మొయినాబాద్ ఫాంహౌజ్ కేసులో బీజేపీ అగ్రనాయకుల పేర్లు వినిపించడం.. మునుగోడు ఉప ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోవడం.. ఆ వెంటనే గ్రానైట్ కంపెనీలపై ఈడీ దాడులు జరగడం.. వీటిని వేరువేరుగా చూడలేమని అంటున్నారు గులాబీ నేతలు. కక్ష సాధింపు చర్యలేనని అనుమానిస్తున్నారు. ఈడీ, బోడీ.. తమనేమీ చేయలేదంటూ.. దమ్ముంటే రమ్మంటూ.. కేసీఆర్, కేటీఆర్ లు పదే పదే సవాల్ చేస్తున్నారు. అంత తొందరెందుకు.. ఇదిగో వస్తున్నాం అంటూ.. ఈడీ జస్ట్ ట్రైలర్ చూపిస్తోందని.. పిక్చర్ అబీ బాకీ హై.. అంటూ కౌంటర్లు వేస్తున్నారు కమలనాథులు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News