BigTV English

Things to Do in the Morning after Waking up : ఉదయం నిద్రలేవగానే ఇలా చేస్తున్నారా…!

Things to Do in the Morning after Waking up : ఉదయం నిద్రలేవగానే ఇలా చేస్తున్నారా…!

Things to Do in the Morning after Waking up : ఈ రోజుల్లో చాలా మంది నిద్ర లేవడం గురించి పెద్దగా పట్టించుకోరు . ఆలారం పెట్టుకుని లేవడం, లేదంటే మెలుకవ రాగానే లేవడం చేస్తుంటారు. ఇదంతా ఉదయమే అంటే తెల్లవారజామున లేచే వాళ్లగురించి. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత పడుకోవడం ఇందులోకి లెక్కలోకి రాదు. పొద్దునే ఉరుకులు పరుగులు మీద నిద్ర లేవడం సరికాదు. అసలు పడుకునేటప్పుడు భూమికి దక్షిణ దిక్కువైపు తలపెట్టుకోవాలి. ఇల్లు ఏ దిక్కులో ఉన్నా సరే.


ఉదయం మెలుకవ రాగానే రెండు మూడు నిమిషాలు అలాగే పడుకోవాలి. రాకెట్ ప్రయోగించేటప్పుడు సరైన దిశలో ఉంచాలి. ఒక డిగ్రీ పక్కన వంగినా అది చివరి లక్ష్యానికి దూరంగా కొన్ని వందల, వేల కిలోమీటర్ల దూరానికి వెళ్లిపోతుంది. కాబట్టి ఫెర్ ఫెక్షన్ ఉంటేనే లక్ష్యానికి వెళ్తుంది

అందుకే ప్రతీ ఒక్కరూ నిద్రలేవడం అనేది రాకెట్ లాంఛింగ్ లాంటిదే. కొంచెం తేడా వచ్చినా డైలీ మీరు చేరుకోవాల్సిన గమ్యం, గమనం మారిపోతుంటాయి. గబుక్కున లేచి తయారు కాకూడదు. మెలకువ రాగానే మంచం మీదే రెండు మూడు నిమిషాలు అలాగే ఉండాలి. మీ ఆలోచనలు అన్నీ క్రమంగా ఉండటానికి ఇది ఉపయోగపడుతుంది. నిద్ర లేవగానే మీరు మీ అరచేతుల్ని చూసుకోండి. మీ వేలి మొనల్లో లక్ష్మీదేవి ఉంటుంది. అరచేతి మధ్యలో సరస్వతి ఉంటుంది. మణికట్టు మీద గౌరీ దేవి ఉంటుంది.


ఈ అరచేతుల్ని చూసుకుంటే లక్ష్మీస్వరూప శ్లోకాలను గుర్తు చేసుకోండి. అవేమీ రాకపోతే వాటి స్వరూపాలను గుర్తు చేసుకోండి. తర్వాత ఆ అరచేతుల్ని ముఖానికి, కళ్లకు రాసుకోండి . తర్వాత తూర్పు, ఉత్తర లేదా ఈశాన్యం వైపు మంచం దిగాలి. దిగిన తర్వాత భూమికి దండం పెట్టుకోండి.

ఉత్తరం లేదా ,ఈశాన్యం, తూర్పు వైపు మూడు నాలుగు అడుగులు వేసి ముందుకెళ్లండి. రోజు ఇలా ప్రారంభిస్తే మంచి జరుగుతుంది. వీలైతే పంచభూతాలకి సంబంధించిన ఏదైనా ఒక పని చేయండి. నీళ్లుకి సంబంధించిన పనైతే మంచిది. ఈశాన్యం వైపు తిరిగి ఒక చెంబు నీళ్లు పారబోయండి. తర్వాత మీ ఇంట్లో ఉన్న మొక్కల్ని చూడండి.

పైసా ఖర్చు లేని పని. ఇవన్నీ ప్రతీ రోజు చేస్తే జీవితంలో మార్పు గమనిస్తారు. ఉదయం పూట మీకు ఆనందం కలిగించే పని ఏదైనా ఒకటి చేయండి. కొంతమందికి ఒక స్త్రోతం చదివితే ఆనందం కలగచ్చు….ఒక దృశ్యం చూస్తే ఆనందం కలగచ్చు….లేదంటే సెల్ఫ్ హిప్నటైజ్ లాంటివి చేసుకోండి. దీని వల్ల ప్రసన్నత కలుగుతుంది. ఆనందం కలగడం మైండ్ లో పాజిటివ్ యాటిట్యూడ్ పెరుగుతుంది.

Follow this link for more updates :- Bigtv

Tags

Related News

Bed Room Vastu: పొరపాటున కూడా.. ఇలాంటి వస్తువులు బెడ్ రూంలో పెట్టొద్దు !

Bullet Baba temple: ఈ గుడిలో ప్రసాదంగా మద్యం.. మిస్టరీగా బుల్లెట్ బాబా రహస్య ఆలయం!

Srivari Chakrasnanam: శ్రీవారి చక్రస్నానంలో అద్భుతం.. రెండు కళ్లూ సరిపోవు

Navratri: నవరాత్రి 9వ రోజు.. దుర్గాదేవిని ఇలా పూజిస్తే సకల సంపదలు !

Bathukamma 2025: సద్దుల బతుకమ్మ.. పేరు వెనక అసలు కథ ఇదే !

Ramayana Story: ఎలుక పై మూడు గీతలు వెనుక శ్రీరాముడి మహిమ? మీకు తెలుసా?

Navratri Day 8: నవరాత్రుల్లో 8వ రోజు.. సరస్వతి దేవిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: వెన్నముద్దల బతుకమ్మ ప్రత్యేకత ఏంటి ?

Big Stories

×