ప్రశాంతంగా ఉన్న ఉత్తర ప్రదేశ్ లో మత ఘర్షణలు చెలరేగేలా ఓ వర్గం వాళ్లు ప్రయత్నిస్తున్నారనే అనుమానాల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ముఖ్యంగా బరేలీలో ఈ అల్లర్లకు ప్లాన్ చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎలాంటి అప్పుడు సమాచారం బయటకు వ్యాపించకూడదనే ఉద్దేశంతో బరేలీ అంతటా రెండు రోజుల పాటు ఇంటర్నెట్ బంద్ చేయడంతో పాటు భారీ భద్రత ఏర్పాటు చేశారు. మసీదులలో శుక్రవారం ప్రార్థనలకు ముందు ఇంటర్నెట్ కట్ చేశారు. ఎక్కడిక్కడ పోలీసు బలగాలు మోహరించాయి. రోడ్లన్నీ నిర్మానుష్యంగా దర్శనం ఇస్తున్నాయి. గురువారం నాడు ‘ఐ లవ్ ముహమ్మద్’ అంటూ కొంత మంది ముస్లీంలు పోస్టర్లు పట్టుకుని ప్రదర్శనలు చేశారు. అనంతరం గొడవలు తలెత్తాయి. ఇందుకు కారణమైన 81 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
శుక్రవారం ఘర్షణలు, అరెస్టుల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు ఇంటర్నెట్ బంద్ చేశారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి శనివారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఇంటర్నెట్ నిలిపివేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బరేలీ పరిధిలోని నాలుగు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేసినట్లు వెల్లడించారు. ఫేస్ బుక్, యూట్యూబ్, వాట్సాప్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లను ఉపయోగించడం ద్వారా పుకార్లు వ్యాప్తి చెందకుండా, మతపరమైన ఉద్రిక్తతను ప్రేరేపించకుండా నిరోధించడానికి ఇంటర్నెట్ పై ఆంక్షలు విధించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. అంతేకాదు, ఎస్సెమ్మెస్ సేవలు, మొబైల్ ఇంటర్నెట్, బ్రాడ్ బ్యాండ్, వైర్ లెస్ కనెక్షన్‌లు నిలిపివేసినట్లు హోం కార్యదర్శి గౌరవ్ దయాల్ తెలిపారు.
ఇంటర్నెట్ సస్పెన్షన్ తో పాటు బరేలీలో పోలీసులు, ప్రావిన్షియల్ ఆర్మ్డ్ కాన్స్టాబులరీ (PAC), రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) సిబ్బంది మోహరించారు. డ్రోన్ లతో భద్రతను సమీక్షిస్తున్నారు. “అన్ని జిల్లా న్యాయాధికారులు, డిప్యూటీ కలెక్టర్లు, పోలీసులు, పరిపాలనా అధికారులు అలర్ట్ గా ఉండాలి. ఎక్కడ ఎలాంటి విఘాతం కలిగినా, ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా కఠిన చర్యలు తీసుకుంటారు” అని బరేలి డివిజనల్ కమిషనర్ భూపేంద్ర ఎస్ చౌదరి హెచ్చరించారు. అంతేకాదు, బరేలీని నాలుగు సూపర్ జోన్‌లు, నాలుగు ప్రత్యేక జోన్‌లుగా విభజించారు. వీటికి అనుగుణంగా బలగాలను మోహరించామని బరేలీ SSP అనురాగ్ ఆర్య వెల్లడించారు. శుక్రవారం నమాజ్ తర్వాత ఈ ప్రాంతంలోని మత పెద్దలను ఇంటికి వెళ్లమని కోరినట్లు తెలిపారు. బరేలీతో పాటు, ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్ పూర్, పిలిభిత్, బుడాన్ జిల్లాలకు కూడా నిఘా వర్గాలు హై అలర్ట్ జారీ చేశాయి. “సున్నితమైన ప్రదేశాలలో సాయుధ పోలీసు దళాలను మోహరించారు. బరేలీలో జరిగిన అల్లర్లు పొరుగు జిల్లాలకు వ్యాపించకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నాము” అని పోలీసు అధికారులు తెలిపారు.
#WATCH | Bareilly, Uttar Pradesh | On 'Jumme ki Namaz', SSP Bareilly, Anurag Arya, says, "Today, the city has been divided into four super zones and four special zones, and forces have been deployed accordingly. Police forces have also been deployed in sensitive areas…… pic.twitter.com/xeqsLhtLF2
— ANI (@ANI) October 3, 2025
‘ఐ లవ్ ముహమ్మద్’ ప్రచారం గత వారం బరేలీలో భారీ హింసకు దారితీసింది. ఒక మసీదు వెలుపల దాదాపు 2,000 మంది ముస్లీంలు ఈ ప్రదర్శనలో పాల్గొనేందుకు గుమిగూడారు. చివరి నిమిషంలో ఈ ప్రదర్శనను నిలిపివేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ ప్రదర్శనకు అధికారులు అనుమతి ఇవ్వలేదని చెప్పారు. ప్రదర్శన రద్దు చేయడంపై ముస్లీంలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న పోలీసులపై రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. ఈ దాడికి పాల్పడిని పలువురిని పోలీసులు అరెస్టు చేయడంతో వివాదం చెలరేగింది.
Read Also: రాజస్థాన్‌లో దగ్గు సిరప్ చిచ్చు.. టెస్ట్ చేసిన డాక్టర్‌కి ఏమైంది?