Akshay Kumar: బాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సీనియర్ నటుడు అక్షయ్ కుమార్(Akshay Kumar) ఒకరు. అక్షయ్ కుమార్ ఇటీవల ముంబైలో జరిగిన సైబర్ అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన సైబర్ మోసాల గురించి పలు విషయాలను తెలియచేయడమే కాకుండా తన కూతురి విషయంలో జరిగిన ఒక చేదు సంఘటనని కూడా అందరితో పంచుకున్నారు. కొన్ని నెలల క్రితం నా కుమార్తె వీడియో గేమ్ ఆడుతోంది. అయితే ఇలాంటి గేమ్స్ ఆడేటప్పుడు మనం కొంతమంది అపరిచితులతో ఆడుతూ ఉంటాము అయితే ఆ సమయంలో అవతల నుంచి మనకు ఒక మెసేజ్ వస్తుంది.
ఇలా నా కూతురు వీడియో గేమ్ ఆడేటప్పుడు అపరిచిత వ్యక్తి నుంచి మీరు ఆడ? మగ అనే మెసేజ్ వచ్చిందని, వెంటనే నా కూతురు ఆడ అని సమాధానం ఇవ్వడంతో వెంటనే మీ నగ్న ఫోటోలు (Nude Photos)పంపించండి అంటూ అడిగారని అక్షయ్ కుమార్ ఈ చేదు సంఘటన గురించి తెలియజేశారు. ఇలాంటి మెసేజ్ రావడంతో వెంటనే నా కూతురు నితారా(Nitara) ఈ విషయం తన అమ్మతో చెప్పిందని, ఈ విషయంపై తాను సైబర్ క్రైమ్ ఆశ్రయించానని వెల్లడించారు. అయితే సైబర్ అనేది పెద్ద మోసం అని, ఇలాంటి సందేశాలు పంపించడం కూడా సైబర్ నేరంలో ఒక భాగం అని తెలిపారు.
ఇలా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తాను మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక్కటే వేడుకుంటున్నాను. మన రాష్ట్రంలో ఏడు నుంచి పదవ తరగతి చదివే విద్యార్థులకు ప్రతివారం సైబర్ పీరియడ్(Cyber Period) అంటూ ఒక పీరియడ్ పెట్టి పిల్లలకు సైబర్ మోసాల పట్ల అవగాహన కల్పించాలని నేను మహారాష్ట్ర ముఖ్యమంత్రిని అభ్యర్థిస్తున్నానని అక్షయ్ కుమార్ వెల్లడించారు. ఈ సైబర్ నేరాలు వీధి నేరాలు కంటే పెద్దదిగా మారుతోందని ఇలాంటి వాటిని ఆపడం చాలా ముఖ్యమని ఈయన ఈ సందర్భంగా తన ఇంట్లో జరిగిన సంఘటనను తెలియజేస్తూ అందరిలో అవగాహన కల్పించారు.
?igsh=MTQ4OHMwMGdpNjZ5bA%3D%3D
ఇటీవల కాలంలో ఎంతోమంది మహిళలు ఇలాంటి వాటి పట్ల ఎన్నో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అందుకే వీటిపై అవగాహన కావాలని అక్షయ్ కుమార్ కోరారు. అక్షయ్ కుమార్ 2001, జనవరిలో ట్వింకిల్ కన్నా(Twinkel Kanna) అనే మహిళను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు సంతానం కూతురు నితార, కుమారుడు ఆరవ్(Aarav) ఉన్నారు. ఇక అక్షయ్ కుమార్ కెరియర్ విషయానికి వస్తే ఇటీవల ఈయన హౌస్ ఫుల్ 5 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక తెలుగులో మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్ప సినిమాలో కూడా ఈయన శివుడి పాత్రలో నటించి ప్రేక్షకులను సందడి చేశారు.ప్రస్తుతం అక్షయ్ కుమార్ వెల్కమ్ టు ది జంగిల్ అనే సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఈ ఏడాది చివరిన క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలుస్తోంది.
Also Read: Rishabh shetty: ప్లీజ్ థియేటర్ లో ఆ పని చేయొద్దు… ప్రేక్షకులను రిక్వెస్ట్ చేసిన రిషబ్ శెట్టి!