BCCI : సాధారణంగా ఇండియన్ క్రికెట్ టీమ్ వేరే దేశాలకు వెళ్లినప్పుడు బీసీసీఐ ఖర్చులు భారీగానే చేస్తుంది. చాలా మందికి టీమిండియా విదేశాలకు వెళ్లినప్పుడు ఎంత ఖర్చు అవుతుంది.. వాటిని ఎవ్వరూ భరిస్తారు.. ఇలాంటి చిత్ర, విచిత్రమైన డౌట్స్ చాలానే వస్తుంటాయి. ముఖ్యంగా క్రికెట్ టీమ్ విదేశాలకు వెళ్ళే ఖర్చులో విమాన ప్రయాణం, హోటళ్లు, రోజువారీ భత్యాలు, భీమా, భద్రతా ఏర్పాట్లు వంటివి ఉంటాయి. అయితే బీసీసీఐ కి ఒక్క టూర్ కి ఎంత ఖర్చు వస్తుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? ముందుగా టీమ్ లో మొత్తం 16 మంది వరకు ఆటగాళ్లు ఉంటారు. వీళ్లతో పాటు 15 మంది వరకు స్టాప్ కూడా ఉంటారు. ఇందులోనే కోచ్, ట్రైనర్లు, ఫిజియో ఇలా అందరూ ఉంటారు. యావరేజీగా 30 మంది వరకు ఉంటారు.
Also Read : T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ లోకి నమీబియా, ఇటలీ ఎంట్రీ…17 జట్లు రెడీ…మరో 3 జట్లు లోడింగ్
దాదాపు 30 మందికి బిజినెస్ క్లాస్ లో ఫ్లైట్ లో వెళ్లడానికి ఒక వ్యక్తికి మూడు నుంచి 4 లక్షల వరకు టికెట్ ఉంటుంది. అంటే టోటల్ గా అందరికి కలిపి 1.2 కోట్ల వరకు ట్రావెల్స్ కే అవుతుంది. ప్లేయర్స్ అండ్ స్టాప్స్ ఉండటానికి 5 స్టార్ హోటల్స్ తీసుకుంటారు. హోటల్ కి యావరేజ్ గానే 2.1 కోట్లు ఖర్చు అవుతుంది. బీసీసీఐ ప్రతీ ఒక్కరికీ రూ.20 వేల నుంచి 80 వేల వరకు డైలీ అలవెన్స్ కింద ఇస్తారు. మొత్తం టూర్ కి కలిపి 1.8 కోట్లు అవుతుంది. ఇక అక్కడ ఉండే ఎక్స్ ట్రా ఖర్చులు కూడా ఉంటాయి. సెక్యూరిటీ, ట్రాన్స్ ఫోర్ట్స్, ఫుడ్ అని చాలా వరకు ఖర్చులు ఉంటాయి. వీటికి కూడా రూ.5 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. మొత్తానికి ఒక టూర్ పూర్తయ్యే లోపు రూ.10 నుంచి 15 కోట్ల వరకు బీసీసీఐకి ఖర్చు వస్తుంది. ఈ టూర్ కి 100 నుంచి 250 కోట్ల వరకు లాభం ఉంటుంది.
ప్రపంచంలో అత్యంత సంపన్నపైన క్రికెట్ బోర్డు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ). అందుకే బీసీసీఐ చెప్పినట్లే అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నడుచుకుంటుంది. ఐసీసీనే కాదు ఇతర దేశాల క్రికెట్ బోర్డులు సైతం బీసీసీఐని పెద్దన్నగా భావిస్తాయి. భారత్‌తో మ్యాచ్‌లు ఆడేందుకు ఆసక్తికనబరుస్తాయి. అయితే ఇంత సంపన్నమైన క్రికెట్ బోర్డుకు చెందిన భారత ఆటగాళ్ల జీతాలు కూడా ఎక్కువగా ఉంటాయని అంతా అనుకుంటారు. కానీ వాస్తవానికి భారత్ ఆటగాళ్ల కంటే ఇంగ్లండ్ ప్లేయర్ల జీతాలు ఎక్కువ. ఇరు జట్ల వార్షిక కాంట్రాక్టులతో పాటు మ్యాచ్ ఫీజులు, బోనస్ విషయాల్లో కూడా భారీ తేడా ఉంది. బీసీసీఐ కంటే ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) తమ ఆటగాళ్లకు ఎక్కువ జీతాలు అందజేస్తుంది. చాలా వరకు బీసీసీఐ ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డు కావడంతో ఆ బోర్డే వేతనాలు ఎక్కువ ఇస్తుందని అనుకుంటారు. కానీ అది పొరపాటు మాత్రమే. బీసీసీఐ ఇంగ్లాండ్ కంటే తక్కువ ఇచ్చినప్పటికీ.. ఐపీఎల్, తదితర వాటితో కలుపుకుంటే ఇంగ్లాండ్ ఆటగాళ్ల కంటే టీమిండియా ఆటగాళ్లే ఎక్కువ సాలరీ తీసుకోవడం విశేషం.