Alai Balai-2025: అలయ్ బలయ్ 2025.. ప్రముఖ మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది అలయ్ బలయ్ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈరోజు దసరా సందర్భంగా ఈ ఉత్సవం చాలా ఘనంగా జరగనుంది. 20 సంవత్సరాల సుదీర్ఘ విశిష్టత కలిగిన ఈ కార్యక్రమములో తెలంగాణ సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ.. జాతీయ వీరులకు గౌరవం అందిస్తూ.. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించనున్నారు.
ఘనంగా అలయ్ బలయ్ 2025 ఈవెంట్..
ముఖ్యంగా ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సూఖ్ మండవియా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర గనులు, కట్టడాల మంత్రి జి.కిషన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నారు. అయితే ఈ వేడుకకు తనకు కూడా ఆహ్వానం అందడంపై సంతోషం వ్యక్తం చేశారు ప్రముఖ సినిమా హీరో నాగార్జున (Nagarjuna).
ఈ సత్కారం కొత్తగా అనిపిస్తోంది – నాగార్జున
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. “ఇలాంటి సత్కారం చేయించుకోవడం నాకు నా కెరియర్ లోనే మొదటిసారి. కాస్త కొత్తగా అనిపిస్తోంది. ముఖ్యంగా గత 20 సంవత్సరాలుగా బండారు దత్తాత్రేయ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అన్ని రంగాల నుంచి ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు , ప్రముఖులు ఒకే వేదిక మీదకు రావడం మనకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది . ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా అభినందనీయం. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విజయలక్ష్మి గారికి నా అభినందనలు. ముఖ్యంగా ఇలాంటి గొప్ప కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు “అంటూ నాగార్జున చెప్పుకొచ్చారు. ఇక ప్రస్తుతం నాగార్జున చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
నాగార్జున కెరియర్..
దివంగత నటులు , తెలుగు సినిమా ఇండస్ట్రీకి పిల్లర్ లలో ఒకరిగా నిలిచిన అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నాగార్జున. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో మాస్, యాక్షన్ , రొమాంటిక్ చిత్రాలతో భారీ పాపులారిటీ అందుకున్నారు. ముఖ్యంగా నవ మన్మధుడిగా, కింగ్ హీరోగా , మాస్ గా ఇలా పలు బిరుదులు అందుకున్న నాగార్జున.. ఈ వయసులో కూడా అంతే యంగ్గా కనిపిస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఒకవైపు హీరోగా చేస్తూనే మరొకవైపు పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు నాగార్జున.
హీరో గానే కాదు హోస్ట్ గా కూడా..
నాగార్జున హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రమే కాదు హోస్ట్ గా కూడా కొనసాగుతున్నారు. బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ వంటి కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తూ.. ఇటు బుల్లితెర ఆడియన్స్ కి కూడా మరింత దగ్గరయ్యారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 మొదలు ఇప్పటివరకు కూడా హోస్ట్గా వ్యవహరిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అలాగే తన 100వ సినిమాకి కూడా శ్రీకారం చుట్టారు నాగార్జున. ఈ సినిమాతో ఎలాగైనా 100 కోట్ల క్లబ్లో చేరాలని చూస్తున్న నాగార్జున అనుకున్న కలను నెరవేర్చుకుంటారేమో చూడాలి.
ALSO READ:Indian Movie’s: ఇండియన్ చిత్రాల థియేటర్లపై దాడులు.. కక్ష సాధింపు చర్యలేనా?