Vivo Y31 5G vs Galaxy M36 vs Redmi 15 5G | ఇండియాలో చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో ఇటీవలే Y31 5జీని (Vivo Y31 5G) లాంచ్ చేసింది. ఇది రెడ్మీ 15 5జీ.. శామ్‌సంగ్ గెలాక్సీ M36 5జీతో పోటీ పడుతుంది.
మూడు ఫోన్‌లు బడ్జెట్ ధరలోనే 5జీ టెక్నాలజీని అందించడం విశేషం. వివోలో స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్ ఉండగా.. రెడ్మీ స్నాప్‌డ్రాగన్ 6స్ జెన్ 3తో వస్తుంది. శామ్‌సంగ్.. ఎక్సినాస్ 1380 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ధర, డిస్‌ప్లే, బ్యాటరీ లాంటి ఫీచర్ల పోల్చి ఏది కొనుగోలు చేయాలో చూద్దాం.
వివో Y31 5జీ 4జీబీ + 128జీబీ వేరియంట్ ₹14,999 తక్కువ ధరకే లభిస్తుండగా.. 6జీబీ + 128జీబీ వేరియంట్ ₹16,499 ధరకు అందుబాటులో ఉంది. రెడ్మీ 15 5జీ 6జీబీ + 128జీబీ ₹14,999కు, 8జీబీ + 256జీబీ ₹16,999కు లభిస్తోంది.
మరోవైపు శామ్‌సంగ్ గెలాక్సీ M36 5జీ 6జీబీ + 128జీబీ ₹14,664కి. 8జీబీ + 128జీబీ ₹16,308 ధరకు మాత్రమే అందబాటులో ఉంది.
ధర, వేరియంట్లు పోల్చి చూస్తే శామ్‌సంగ్ పెద్ద బ్రాండ్ అయినా.. తక్కువ ధరతో కస్టమర్లకు మంచి ఆప్షన్.
వివో Y31 5జీ 6.68-ఇంచ్ HD+ LCD స్క్రీన్, రెజల్యూషన్ 1608×720 పిక్సెల్స్. 120Hz రిఫ్రెష్ రేట్, 1,000 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంది.
రెడ్మీ 15 5జీ 6.9-ఇంచ్ FHD+ డిస్‌ప్లే. 2340×1080 రెజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, 850 నిట్స్.
శామ్‌సంగ్ గెలాక్సీ M36 5జీ 6.7-ఇంచ్ సూపర్ AMOLED. FHD+ రెజల్యూషన్, 120Hz రేట్. రెడ్మీలో బెటర్ వీడియో ప్లేబ్యాక్.
Y31 5జీలో 6,500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ ఉండగా.. రెడ్మీ 15 5జీలో 7,000mAh, 33W చార్జింగ్, 18W రివర్స్ చార్జింగ్ తో వస్తుంది. గెలాక్సీ M36 5జీలో 5,000mAh, 25W చార్జింగ్ మాత్రమే ఇస్తుంది.
రెడ్మీ బ్యాటరీ లైఫ్ విషయంలో మిగతా రెండింటి కంటే బెటర్.
వివో Y31 5జీ Funtouch OS 15పై ఆండ్రాయిడ్ 15. రెడ్మీ 15 5జీ హైపర్OS 2.0పై ఆండ్రాయిడ్ 15. M36 5జీ One UI 7పై ఆండ్రాయిడ్ 15. మూడూ స్మూత్ పెర్ఫార్మెన్స్ ఇస్తాయి.
వివో Y31 5జీ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2తో బేసిక్ టాస్క్‌లకు. రెడ్మీ 15 5జీ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3తో హెవీ యాప్ పెర్ఫార్మెన్స్‌కు.. M36 5జీ ఎక్సినాస్ 1380తో మల్టీటాస్కింగ్ ఉపయోగపడతాయి. ప్రాసెసర్ పర్‌ఫామెన్స్ లో వివో మిగతా రెండు కంటే వెనుకంజలో ఉంది.
వివో Y31 5జీ 50MP (f/1.8) మెయిన్ కెమెరా, 0.08MP సెకండరీ, 8MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. రెడ్మీ 15 5జీ 50MP (f/1.75) రియర్, 8MP సెల్ఫీ. M36 5జీ 50MP OIS రియర్, 8MP అల్ట్రా-వైడ్, 2MP మ్యాక్రో, 13MP ఫ్రంట్. శామ్‌సంగ్ కెమెరాలో మెరుగ్గా ఉంది.
రెడ్మీ 15 5జీ బ్యాటరీ, డిస్‌ప్లే, పెర్ఫార్మెన్స్‌కు టాప్. శామ్‌సంగ్ M36 AMOLED, కెమెరా, సాఫ్ట్‌వేర్ సపోర్ట్‌కు మంచిది. వివో Y31 5జీ బ్యాటరీ లైఫ్, బేసిక్ అవసరాలకు మంచిది. ఇది రెగ్యులర్ యూజర్లకు సరిపోతుంది.
Also Read: భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుపోయే ఐఫోన్ మోడల్ ఇదే