Lipstick Side Effects: ప్రస్తుతం లిప్ స్టిక్ వాడే వారి సంఖ్య చాలా పెరిగిపోయింది. ఇది పెదవులకు అందాన్ని, ఆకర్షణను ఇస్తుంది. ఇదిలా ఉంటే.. మార్కెట్‌లో లభించే అనేక లిప్‌స్టిక్‌లలో ఉండే కొన్ని రసాయన పదార్థాలు దీర్ఘకాలంలో ఆరోగ్యానికి.. ముఖ్యంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి తీవ్ర సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లిప్ స్టిక్‌ను ఉపయోగించినప్పుడు అనుకోకుండా నోటి లోకి కూడా చేరుతుంది. ఇలా హానికర పదార్థాలు శరీరంలోకి చేరే అవకాశం ఉంది.
1. ప్రధాన ప్రమాద కారకాలు:
లిప్ స్టిక్‌లలో రంగు కోసం లేదా తయారీ ప్రక్రియలో మలినాలుగా చేరే భార లోహాలు ముఖ్యమైన ఆరోగ్య సమస్యలను గుర్తిస్తాయి. వీటిలో కొన్ని ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కారణమయ్యే కార్సినోజెనిక్ లక్షణాలను కలిగి ఉంటాయి.
కాడ్మియం : లిప్ స్టిక్ ద్వారా ఈ లోహం శరీరంలోకి వెళ్లడం వల్ల ఊపిరితిత్తుల కణజాలం దెబ్బతిని, కాలక్రమేణా ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.
క్రోమియం: ఇది కూడా మానవ క్యాన్సర్ కారకంగా చెబుతారు. ఎక్కువ మోతాదులో దీర్ఘకాలం పాటు క్రోమియం శరీరంలోకి చేరితే, ఊపిరితిత్తులు, జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
సీసం: అనేక అధ్యయనాలలో లిప్‌స్టిక్‌లలో సీసం మలినాలను గుర్తించారు. సీసం ప్రధానంగా నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది , అయినప్పటికీ.. ఇది దీర్ఘ కాలికంగా శరీరంలో పేరుకుపోయి ఇతర ఆరోగ్య సమస్యల (నరాల సమస్యలు, సంతా నలేమి) తో పాటు పరోక్షంగా క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచవచ్చు.
2. ఇతర ప్రమాదకర రసాయనాలు:
భార లోహాలతో పాటు, లిప్‌స్టిక్ ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి ఉపయోగించే కొన్ని రసాయనాలు కూడా హాని కలిగిస్తాయి.
పారాబెన్స్: వీటిని ప్రిజర్వేటివ్స్‌గా ఉపయోగిస్తారు. పారాబెన్స్ హార్మోన్ల వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. ఇవి ముఖ్యంగా ఈస్ట్రోజెన్‌ను అనుకరించి, రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి.
సుగంధ ద్రవ్యాలు : లిప్ స్టిక్‌లో ఉండే రసాయనాలను తయారు చేసే వారు వెల్లడించరు. ఇవి అలర్జీలు, హార్మోన్ల సమతుల్యతలో మార్పులకు దారితీయవచ్చు.
PEGs: కొన్ని ఫార్ములాస్‌లో వీటిని ఉపయోగిస్తారు. ఇవి చర్మానికి చికాకు కలిగించే అవకాశం కూడా ఉంటుంది. వీటి తయారీలో ఉపయోగించే ఇతర మలినాలు కూడా హానికరంగా మారే అవకాశం ఉంది.
Also Read: బీపీని తగ్గించడానికి.. ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి ?
3. తీసుకోవాల్పిన జాగ్రత్తలు:
లిప్ స్టిక్ వాడకాన్ని పూర్తిగా మానేయడం కష్టం కావచ్చు. కాబట్టి.. ప్రమాదాన్ని తగ్గించడానికి ఈ కింది జాగ్రత్తలు తీసుకోవాలి.
నాణ్యతను పరిశీలించండి: విశ్వసనీయత ఉన్న బ్రాండ్లను మాత్రమే ఎంచుకోండి. ముఖ్యంగా “సీసం రహితం (Lead-Free)” లేదా “స్వచ్ఛమైన సౌందర్య సాధనాలు (Clean Beauty)” అని లేబుల్ ఉన్న ఉత్పత్తులను ఎంచుకోవడం ఉత్తమం.
ప్యాచ్ టెస్ట్: కొత్త లిప్ స్టిక్‌ను వాడే ముందు చిన్న ప్రదేశంలో రాసి.. మీ చర్మానికి పడుతుందో లేదో పరీక్షించుకోవాలి.
వాడకాన్ని తగ్గించండి: ప్రతిరోజూ.. ప్రతిపూట లిప్ స్టిక్‌ను వాడకుండా.. వీలైనంత వరకు తగ్గించండి. తిన్న తర్వాత లిప్ స్టిక్‌ను తీసివేయండి.