Big Stories

Charity:- దాన ధర్మాలు ఎవరికి చేయాలి..ఏ వేళలో చేయాలి?

- Advertisement -

Charity:- దానం, ధర్మం రెండూ వేర్వేరు. భూమి మీద ఉన్న ఏ మతమైనా ఏదో రూపంలో దానం చేయాలని చెబుతోంది. ఉన్నంతలో పేదవారిని, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోమని ఉపదేశిస్తుంది. కానీ దానం చేసేటప్పుడు ఇచ్చే వారి చేయి పైన ఉండాలి.. పుచ్చుకునే వారి చేయి కింద ఉండాలి. దానం ఎందుకు చేస్తున్నామో తలుచుకుంటూ చేతిలో అక్షింతలు పెట్టుకుని సంకల్ప పూర్వకంగా.. ఇచ్చే వస్తువు విశేషాలను చెప్పి దానం ఇవ్వాలి. అయితే ధర్మం చేసేటప్పుడు సంకల్పం చేయాల్సిన పనిలేదు. ఎదుటివారికి ఏ వస్తువు అవసరమో, లేదా డబ్బు అవసరమో ఆ విశేషాన్ని ఏ రకమైన పుణ్య ఫలితం ఆశించకుండా అందించడమే ధర్మం.

- Advertisement -

దాన, ధర్మాలకు స్వల్ప తేడా ఉంది. దానం చేస్తే పుణ్యం కలుగుతుంది . ఆ పుణ్యం వల్ల మళ్లీ ఉత్తమ జన్మ లభిస్తుంది. అదే మనం ధర్మాన్ని ఆచరిస్తే మోక్షం కలుగుతుంది. పుణ్యం వల్ల మనకు సంపద కలగవచ్చు . లేదంటే మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనకు మరొకరు సాయం చేయవచ్చు. ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేసే వారి సంఖ్య పెరగవచ్చు. జీవితంలో ఉన్నత స్థానానికి చేరే దారి దొరకవచ్చు. పుణ్యం తరిగిపోతే మరొక జన్మ స్వీకరించాల్సి వస్తుంది.

కానీ ధర్మాన్ని పాటించడం వల్ల శాశ్వతమైన మోక్షం కలుగుతుంది. పునర్జన్మ ఉండదు. దాని లక్షణం వల్ల మహాభారతంలో కర్ణుడు చనిపోయాడు . అతిలోభం వల్ల దుర్యోధనుడు, అతి కామం వల్ల రావణుడు అంతమయ్యారని నీతిశ్లోకాలు చెబుతాయి. దానం చేసేటప్పుడు త్యాగ భావం కలుగుతుంది. అంటే ఆ వస్తువు తమకు అవసరం లేదని అర్ధం. అదే ధర్మం చేసేటప్పుడు ఆ త్యాగ భావం కూడా ఉండదు . ఎలాంటి సంకల్పం కూడా ఉండదు. నాకు ఏవిధమైన మమకారం, ఆపేక్ష లేవని అర్ధం. ఎదుట వారికి అవసరమైన వస్తువు నా దగ్గర ఉంది కాబట్టి ఇస్తున్నట్టు లెక్క. దానం కన్నా ధర్మం వల్ల శాశ్వతమైన ఆనందం కలుగుతుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News