BigTV English

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Singer Lipsika:ప్రస్తుత కాలంలో సినీ సెలబ్రిటీలు వరుసగా శుభవార్తలు చెబుతూ అభిమానులను సంబర పరుస్తున్నారు..అయితే ఇప్పుడు సినీ సెలబ్రిటీలే కాదు సింగర్స్ కూడా శుభవార్తలు చెబుతూ అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తున్నారు. ఈ క్రమంలోనే చిన్నతనంలోనే సింగర్ గా మారి ఇప్పటికీ వరుసగా తన గాత్రాన్ని వినిపిస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఒక సింగర్ శుభవార్త తెలిపింది. అంతేకాదు కీరవాణి చేతుల మీదుగా ఆ శుభవార్తను అభిమానులతో పంచుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.


కీరవాణి చేతుల మీదుగా లిప్సిక ఇంట శుభకార్యం..

ఆమె ఎవరో కాదు ప్రముఖ సింగర్ లిప్సిక(Lipsika) . సింగర్ గా , డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పేరు సొంతం చేసుకున్న ఈమె తాజాగా తనకు కూతురు జన్మించింది అంటూ శుభవార్తను అభిమానులతో పంచుకుంది. అంతేకాదు ఊయల వేడుకను ఘనంగా జరుపుకున్న ఈమె.. అందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో తోటి సింగర్స్, నెటిజన్ లు కూడా ఈమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాదు ప్రముఖ ఆస్కార్ గ్రహీత ఎంఎం కీరవాణి (MM keeravani) ఈ ఈవెంట్ కి వచ్చి పాపను ఆశీర్వదించారు. ఎం ఎం కీరవాణి చేతుల మీదుగా జరిగిన ఈ ఫంక్షన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.


సింగర్ మాత్రమే కాదు డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా..

లిప్సిక విషయానికి వస్తే.. ఎంబీఏ పూర్తి చేసిన ఈమె చిన్నతనంలోనే పలు సింగింగ్ కాంపిటీషన్లో పాల్గొని సింగర్ గా ప్రూవ్ చేసుకుంది. సింగర్ గా కెరియర్ ఆరంభించిన ఈమె బింబిసారా, టెంపర్, ఎక్స్ప్రెస్ రాజా, ప్రేమ కథ చిత్రం, బాహుబలి వంటి తదితర చిత్రాలలో పాటలు పాడింది. ఒకవైపు పలు సినిమాలలో సింగర్ గా పనిచేస్తూనే.. మరొకవైపు హీరోయిన్లకు డబ్బింగ్ కూడా చెబుతూ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పేరు దక్కించుకుంది. అలా మేం వయసుకు వచ్చాం సినిమాతో తన డబ్బింగ్ కెరీర్ ను ఆరంభించిన లిప్సిక.. హెబ్బా పటేల్, మేఘ ఆకాష్ , మెహరీన్ వంటి హీరోయిన్లకు వాయిస్ అందించింది.

ALSO READ:Movies in October: దసరా, దీపావళి ఒకేసారి.. థియేటర్లలో విడుదల కాబోతున్న బిగ్గెస్ట్ చిత్రాలివే!

లిప్సిక వ్యక్తిగత జీవితం..

లిప్సిక వ్యక్తిగత, వైవాహిక జీవితం విషయానికి వస్తే 2012లో ఉదయ్ కిరణ్ అనే వ్యక్తిని ఈమె వివాహం చేసుకుంది. పెద్దల ఆశీర్వాదంతో వివాహం చేసుకున్న ఈ జంట ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. 2012లో వీరి వివాహం కాగా ఇన్నేళ్లకు కూతురు పుట్టడంతో ఆనందంతో మునిగిపోయిన ఆ ఇంట ఈ కార్యం మరింత సంతోషాన్ని కలిగించింది. కొన్ని సంవత్సరాలుగా కీరవాణి దగ్గర శిష్యరికం చేస్తున్న లిప్సిక ఆయన ఆశీర్వాదం తన కూతురికి కూడా ఉండాలని ఆయనను ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్లు సమాచారం. ముఖ్యంగా కీరవాణి ఆశీర్వదించిన విజువల్స్ కూడా ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే ఈ కార్యక్రమానికి ఎమ్ ఎమ్ కీరవాణితో పాటు ప్రముఖ నటి, బిగ్ బాస్ ఫేమ్ , హీరో వరుణ్ సందేశ్ భార్య వితికా షేరు కూడా వచ్చి సందడి చేశారు. మొత్తానికైతే లిప్సిక కూతురు ఊయల పండుగ చాలా ఘనంగా జరిగిందని చెప్పవచ్చు.

?utm_source=ig_web_copy_link

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Big Stories

×