Illu Illalu Pillalu Serial Today Episode: అమూల్య దగ్గరకు వెళ్లి శ్రీవల్లి తనకు ఏమైనా లవ్ స్టోరీలు ఉన్నాయా అని అడుగుతుంది. ఇంతలో అక్కడికి ప్రేమ వస్తుంది. ప్రేమను చూసిన శ్రీవల్లి భయంగా మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతన్నారని ప్రేమ అమూల్యను అడగ్గానే.. ఏం మాట్లాడలేదు.. నాకు లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతుంది అని అమూల్య చెప్పగానే.. సరే నీకు కాలేజీకి టైం అవుతుంది నువ్వు వెళ్లు అంటూ ప్రేమ చెప్పగానే.. అమూల్య వెళ్లిపోతుంది. శ్రీవల్లి కూడా నేను వెళ్తున్నాను అంటుంది.
దీంతో ప్రేమ కోపంగా అమూల్యతో లవ్ స్టోరీల గురించి ఎందుకు మాట్లాడావు అంటుంది. నువ్వు సాగదీసి అటు తిప్పి ఇటు తిప్పి మసి పూసి మారేడు కాయ చేస్తే అంత తేలిగ్గా నమ్మేస్తాను అనుకున్నావా..? ఎప్పుడూ లేనిది నువ్వు అమూల్యకు లవ్ స్టోరీస్ ఉన్నాయా అని అడగడం.. మా అన్నయ్య మంచోడు అనడం చూస్తుంటే నువ్వు ఏదో చేస్తున్నావు అని అనుమానంగా ఉంది అంటూ ప్రేమ కోపంగా తిట్టగానే.. అయ్య బాబోయ్ నేనేం చేయడం లేదు. అమాయకురాలిని ఇంత మంచి దాన్ని నా మీద లేని పోని నిందలే వేస్తే నీ కళ్లు పోతాయి అంటుంది శ్రీవల్లి. దీంతో ప్రేమ కోపంగా నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నేను నర్మద అక్క అంత మంచిదాన్నికాదు నిన్ను నీ ఇంటి దాకా పరిగెత్తిస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది.
నర్మద ఆఫీసుకు వెళ్లడానికి రెడీ అయి వచ్చి వేదవతిని ఆశీర్వదించమని అడిగి వెళ్లిపోతుంటే.. వేదవతి కోపంగా ఏయ్ వెళ్లి నాకు మంచినీళ్లు తీసుకురా అని అంటూ గట్టిగా చెప్తుంది. నర్మద పాస్ట్‌గా వచ్చి నీళ్లు ఇవ్వగానే.. మళ్లీ స్ట్రాంగ్ గా కాఫీ తీసుకురా అని చెప్తుంది. దీంతో నర్మద నాకు ఆఫీసుకు టైం అవుతుంది ప్రమోషన్ వచ్చాక మొదటి రోజే లేట్ అయితే బాగుండదు అత్తయ్యా మీరే వెళ్లి కాపీ పెట్టుకుని తాగండి అంటుంది. దీంతో వేదవతి కోపంగా ఏయ్ వెళ్లి కాఫీ తీసుకురా అంటుంది. దీంతో నర్మద కాఫీ తీసుకొచ్చి ఇచ్చి వెళ్తుంటే.. మళ్లీ వెళ్లకుండా ఆపేస్తుంది. ఇంతలో నర్మద ఏదో చెప్పి బయటకు వెళ్తుంది. బయట రామరాజు ఉంటాడు. ఆయన్ని చూసిన నర్మద ఆశీర్వదించమని అడుగుతుంది. తన ఆశీర్వాదం కన్నా నీ విధి నిర్వహణలో జాగ్రత్తగా ఉండమని చెప్తాడు. ప్రభుత్వ జాబులో ప్రమోషన్ వచ్చే కొద్ది శత్రువులు పెరుగుతారు అని జాగ్రత్తలు చెప్తాడు.
తర్వాత కామాక్షి ఏడుస్తూ రామరాజు ఇంటికి వెళ్తుంది. ఏడుస్తూ వచ్చిన కామాక్షిని చూసిన రామరాజు ఏం జరిగిందని అడుగుతాడు. దీంతో తాను లక్ష రూపాయలు అడిగితే ఆయన ఇవ్వనన్నాడు.. అని ఏడుస్తూ చెప్తుంది. దీంతో రామరాజు కోపంగా అల్లుడికి ఫోన్ చేసి ఏమయ్యా అల్లుడు లక్ష రూపాయల కోసం నా కూతురుని ఏడిపిస్తావా.? అంటూ తిడుతుంటే.. నెక్లెస్ విషయం అల్లుడికి గుర్తుకు వచ్చి ఇలా నన్ను ఇరికిస్తావా..? అని మనసులో అనుకుంటాడు. వెంటనే ఆ లక్ష రూపాయలు నేను పంపిస్తాను అని రామరాజు చెప్పి కాల్ కట్ చేస్తాడు. తర్వాత బ్యాంక్ మేనేజర్‌కు ఫోన్ చేసి తన అల్లుడి అకౌంట్‌కు మనీ పంపమని చెప్పి అలాగే తన అకౌంట్ లో ఎంత అమౌంట్ ఉందో చెప్పమని అడుగుతాడు. ఇంతలో ఇవాళ్టీ ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఏపిసోడ్ అయిపోతుంది.