Asia Cup 2025 : ఆసియా కప్ 2025లో భాగంగా శ్రీలంక వర్సెస్ భారత్ మధ్య సూపర్ 4 చివరి మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠ కొనసాగింది. ఉత్కంఠతో కూడా విజయం ఎవ్వరినీ వరించిందో అంచెనా వేయడం కష్టంగా మారింది. ఎందుకు అంటే ఇరు జట్లు కూడా సూపర్ ఓవర్ ఆడాయి. సూపర్ ఓవర్ జరిగిన తరువాత కానీ మ్యాచ్ ఫలితం తేలలేదు. వాస్తవానికి శ్రీలంక ఆటగాళ్లు చాకచక్యంగా వ్యవహరిస్తే.. సూపర్ ఓవర్ వరకు వెళ్లేది కాదు. కానీ శ్రీలంక ఆటగాళ్లు చేసిన పొరపాటుకు సూపర్ ఓవర్ జరగాల్సి వచ్చింది.
Also Read : Pathum Nissanka Six: నిస్సంక భయంకరమైన సిక్స్…తుక్కు తుక్కైన కారు..తలపట్టుకున్న గంభీర్
టీమిండియా బౌలర్ హర్షిత్ రాణా వేసిన 19.6 వ బంతికి శనక 2 రెండు పరుగులు తీసి డైవ్ చేశాడు. శనక కనుక డైవ్ చేయకుండా ఉంటే.. శ్రీలంక విజయం సాధించేది. అయితే దీనిపై శ్రీలంక మాజీ ఆటగాడు జయసూర్య.. శనకపై ఆగ్రహం వ్యక్తం చేశాడట. ఇలాంటి సమయంలో అలా చేస్తారా..? అని మందలించడం గమనార్హం. ఇక సూపర్ ఓవర్ లో ఇండియాకి లక్ కలిసొచ్చింది. ఈ మ్యాచ్ లో ముఖ్యంగా తొలుత టాస్ గెలిచిన శ్రీలంక జట్టు ఫస్ట్ ఫీల్డింగ్ తీసుకుంది. దీంతో టీమిండియా బ్యాటింగ్ కి దిగింది. టీమిండియా ఓపెనర్ అభిషేక్ వర్మ అద్భుతంగా రాణించాడు. మరో ఓపెనర్ గిల్ మాత్రం త్వరగానే ఔట్ అయ్యాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (12) పరుగులు మాత్రమే చేశాడు. ఇక తిలక్ వర్మ మాత్రం కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తిలక్ వర్మ 49 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. చివరి ఓవర్ లో హాఫ్ సెంచరీ సాధిస్తాడనుకున్న సమయంలో స్ట్రైక్ అర్ష్ దీప్ తీసుకున్నాడు. దీంతో తిలక్ వర్మ హాఫ్ సెంచరీ మిస్ అయింది. చివరి బంతిని అర్ష్ దీప్ సింగ్ సిక్స్ గా మలచడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 202 పరుగులు చేసింది. 31 బంతుల్లో 61 పరుగులు చేసి టీమిండియా తరపున టాప్ స్కోరర్ గా నిలిచాడు అభిషేక్ శర్మ.
మరోవైపు శ్రీలంక జట్టు 203 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. అయితే ఓపెనర్ నిస్సాంక 58 బంతుల్లో 107 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కానీ హర్షిత్ రాణా వేసిన చివరి ఓవర్ తొలి బంతికే ఔట్ అయ్యాడు నిస్సాంక. దీంతో శ్రీలంక విజయ అవకాశాలు తగ్గాయి. చివర్లో శనక గెలిపిస్తాడనుకుంటే.. సూపర్ ఓవర్ వరకు తీసుకొచ్చాడని శ్రీలంక ఫ్యాన్స్ అతని పై మండిపడుతున్నారు. చివరి బంతికి శనక కనుక డైవ్ చేయ
కుండా ఉంటే.. కచ్చితంగా శ్రీలంక విజయం సాధించేదని మాజీ క్రికెటర్లు సైతం అభిప్రాయపడుతున్నారు. సూపర్ ఓవర్ లో 4వ బంతికి శనక రనౌట్ అయ్యాడు. కానీ అంపైర్ నాటౌట్ గా ప్రకటించాడు. ఇక ఆ తరువాత బంతికే ఔట్ అయ్యాడు శనక. దీంతో సూపర్ ఓవర్ కేవలం 2 పరుగులు మాత్రమే చేసింది శ్రీలంక జట్టు. మరోవైపు సూపర్ ఓవర్ లో టీమిండియా కీలక బ్యాటర్ అభిషేక్ శర్మను బరిలోకి దించకుండా గంభీర్ అడ్డుకున్నట్టు సమాచారం.