The Paradise: భక్తవత్సలం నాయుడు అనే ఒక పీటీ టీచర్.. నాటకాలు వేస్తూ సినిమా రంగంలో ఒక గుర్తింపు తెచ్చుకోవాలని నానా కష్టాలు పడి.. తెలుగుతెరకు పరిచయమయ్యాడు. దానికోసం ఎన్నో త్యాగాలు చేశాడు. చివరికి తన తల్లిదండ్రుల పెట్టిన పేరును కూడా త్యాగం చేసి మోహన్ బాబు అని మార్చుకున్నాడు. ఇక విలన్ గా ఆయన నటనకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అని చెప్పొచ్చు. అందరి విలన్స్ లాగా ఉంటే మనకంటూ స్పెషల్ ఏం ఉంటుంది అనుకున్న మోహన్ బాబు.. తన విలనిజంలో కొత్త కొత్త భావాలను చూపించేవాడు.
లుక్, యాస ఇవి ఎప్పటికప్పుడు కొత్తగా ఉండాలని కోరుకొనేవాడు. అందుకు తగ్గట్లుగానే ప్రతి పాత్రలో డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ ను చూపించి విలన్ నుంచి హీరోగా మరి.. హీరో నుంచి డైరెక్టర్ గా.. నిర్మాతగా మారి కలక్షన్ కింగ్ గా స్థిరపడ్డాడు. ఇక ఇప్పుడు మరోసారితన విలనిజాన్ని చూపించడానికి సిద్దమయ్యాడు. న్యాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న చిత్రం ది ప్యారడైజ్. దసరా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
జడల్ అనే పాత్రలో నాని కనిపిస్తున్నాడు. ముఖ్యంగా అతని లుక్ చాలా డిఫరెంట్ గా ఉంది. అందులోనూ గ్లింప్స్ లో లం* కొడుకు అనే పదం వాడడంతో ఈ సినిమా దసరాకు మించి రా అండ్ రస్టిక్ గా ఉంటుంది అని తెలిసిపోయింది. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. నానికి ధీటుగా మోహన్ బాబు విలన్ గా నటిస్తున్నాడు అనేసరికి సినిమాపై అంచనాలు ఆకాశానికి తాకాయి. మొన్నటికి మొన్న మంచు లక్ష్మీ ఒక ఇంటర్వ్యూలో ప్యారడైజ్ కోసం నాన్న చాలా విభిన్నమైన లుక్ లో కనిపిస్తారు. దాని కోసం ఆయన చాలా కష్టపడుతున్నారు అని చెప్పుకొచ్చింది. తాజాగా అది నిజమని ప్రూవ్ అయ్యింది.
అవును.. కొద్దిసేపటి క్రితమే ప్యారడైజ్ నుంచి మోహన్ బాబు ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో షికంజా మాలిక్ అనే పాత్రలో మోహన్ బాబు కనిపిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇక ఈ పోస్టర్ లో మోహన్ బాబు లుక్ నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్ అన్నట్లు ఉంది. షర్ట్ లేకుండా..ఒక చైర్ లో కూర్చొని.. రక్తంతో తడిసిన చేతుల మధ్యలో తుపాకీ.. గాగుల్స్ పెట్టుకొని, చేతిలో సిగార్ తో టెర్రిఫిక్ లుక్ తో కనిపించాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి మోహన్ బాబు విలనిజం.. ఈ సినిమాను ఏ రేంజ్ లో నిలబెడుతుందో చూడాలంటే.. వచ్చే ఏడాది మార్చి వరకు ఆగాల్సిందే.