BigTV English

TSSPDCL : 1553 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ .. ఎంపిక ప్రక్రియ ఇలా..?

TSSPDCL : 1553 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ .. ఎంపిక ప్రక్రియ ఇలా..?

TSSPDCL : హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ 1553 జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాత పరీక్ష, పోల్‌ క్లైంబింగ్‌ టెస్ట్‌ల ద్వారా అభ్యర్థులను
ఎంపిక చేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూలు, జోగులాంబ గద్వాల, నారాయణపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యపేట, మెదక్, సిద్ధిపేట, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ – మల్కాజ్‌గిరి, హైదరాబాద్‌ జిల్లాల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. అభ్యర్థులు పదో తరగతితోపాటు ఐటీఐ (ఎలక్ట్రికల్‌ ట్రేడ్‌/వైర్‌మ్యాన్‌) లేదా ఇంటర్ వొకేషనల్‌ కోర్సు (ఎలక్ట్రికల్‌ ట్రేడ్‌) ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 01-01-2023 నాటికి 18-35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో ఐదేళ్లు సడలింపు ఉంది.


ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, పోల్‌ క్లైంబింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఈ రెండు పరీక్షల్లో అర్హత సాధించిన వారిని రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్లకు అనుగుణంగా తుది ఎంపిక చేశారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.24,340 -రూ.39,405 మూలవేతనంగా చెల్లిస్తారు.

రాత పరీక్ష ఎలా అంటే..?
ఈ పరీక్ష మొత్తం 80 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో 65 ప్రశ్నలు ఐటీఐ విభాగం నుంచి వస్తాయి. ఇందులో ఫండమెంటల్స్‌ ఆఫ్‌ ఎలక్ట్రిసిటీ, బ్యాటరీస్, మ్యాగ్నటిజం, ఫండమెంటల్స్‌ ఆఫ్‌ ఏసీ, బేసిక్‌ ఎలక్ట్రానిక్స్, డీసీ మెషిన్స్, ట్రాన్స్‌ఫర్మార్లు, ఏసీ మెషిన్స్, ఎలక్ట్రికల్‌ మెజర్‌మెంట్స్, ఎలక్ట్రికల్‌ పవర్‌ జనరేషన్‌ అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. మిగతా 15 ప్రశ్నలు జనరల్‌ నాలె­డ్జ్‌ పై ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. పరీక్ష సమయం 2 గంటలు. పరీక్ష తెలుగు, ఇంగ్లీష్‌ మాధ్యమాల్లో ఉంటుంది.


రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి మాత్రమే రిజర్వేషన్‌ను అనుసరించి 1:2 నిష్పత్తిలో పోల్‌ క్లైబింగ్‌ టెస్ట్‌కు షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. పోల్‌ క్లైంబింగ్‌లో అర్హత సాధించిన వారిని ఉద్యోగాల్లోకి తీసుకుంటారు.

క్వాలిఫయింగ్‌ మార్కులు : జనరల్/EWS-40 శాతం, బీసీ-35 శాతం, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 30 శాతం మార్కులు సాధించాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ లో దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ: మార్చి 28
హాల్‌టికెట్స్‌ : ఏప్రిల్‌ 24 నుంచి అందుబాటులో ఉంటాయి.
పరీక్ష తేదీ : ఏప్రిల్‌ 30
వెబ్‌సైట్‌: https://tssouthernpower.cgg.gov.in

Related News

Telangana RTC: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ న్యూస్.. త్వరలో ఆర్టీసీలో 3038 ఉద్యోగాలు

IB Jobs: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 3717 ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే జాబ్ నీదే బ్రో..

NIACL: డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. స్టార్టింగ్ వేతనమే రూ.50,000.. డోంట్ మిస్

Indian Army Jobs: రూ. 18 లక్షల జీతంతో.. ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు

Telangana Govt Jobs: ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు.. మెరిట్ లిస్ట్ రిలీజ్, ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్

DSSSB Jobs: సబార్డినేట్ సర్వీసెస్‌లో 615 ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే అప్లై చేసుకోవచ్చు

Big Stories

×