E-Paper
Advertisement

బయటకు వెళ్తే మీ భర్త రాలేదా అని అడుగుతున్నారు.. రవికృష్ణతో రిలేషన్ పై నవ్య స్వామి క్లారిటీ!

బయటకు వెళ్తే మీ భర్త రాలేదా అని అడుగుతున్నారు.. రవికృష్ణతో రిలేషన్ పై నవ్య స్వామి క్లారిటీ!
Advertisement

Navya swamy: నవ్య స్వామి పరిచయం అవసరం లేని పేరు బుల్లితెర నటిగా ఎన్నో అద్భుతమైన సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నవ్య స్వామి ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక నవ్య స్వామి (Navya Swamy)నటుడు రవి కృష్ణ(Ravi Krishna) కలిసి ఆమె కథ అని సీరియల్ లో నటించారు ఇందులో రవి కృష్ణ గౌతమ్ అనే పాత్రలో నటించగా నవ్య స్వామి ఐశ్వర్య అనే పాత్రలో నటించారు. ఇక ఈ సీరియల్ ఎంతో మంచి ఆదరణను సొంతం చేసుకుంది . ఇలా ఈ సీరియల్ మాత్రమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాలలో కూడా వీరిద్దరూ జంటగా, చాలా చనువుగా కనిపించడంతో వీరిద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉంది అంటూ వార్తలు బయటకు వచ్చాయి.

రవి కృష్ణ మంచి ఫ్రెండ్ మాత్రమే..

ఇలా నవ్య స్వామి రవికిషన్ పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ ఒకానొక సమయంలో వీరిద్దరి గురించి వార్తలు బయటకు రావడంతో రవి కృష్ణ నవ్య స్వామి ఇద్దరు కూడా ఈ వార్తలను ఖండించారు. తామిద్దరం కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పినప్పటికీ వీరి రిలేషన్ గురించి వస్తున్న వార్తలకు ఎక్కడ పులి స్టాప్ పడలేదు. ఇకపోతే ఇటీవల నవ్య స్వామి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమెకు రవికృష్ణ తో రిలేషన్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

మీ భర్త రాలేదా అంటూ..

Advertisement

ఈ ప్రశ్నకు నవ్య స్వామి సమాధానం చెబుతూ తాను ఇదివరకే రవి కృష్ణ తో ఉన్న రిలేషన్ గురించి ఎన్నో సందర్భాలలో చెప్పాను అయినప్పటికీ ఇదే ప్రశ్న ఎదురవుతూనే ఉందని తెలిపారు. ఇక బయటకు వెళ్లిన చాలామంది నన్ను రవి కృష్ణ గురించి అడుగుతారు. ఇక కొంతమంది అయితే ఏకంగా బయటకు వెళ్ళినప్పుడు మీ భర్త రాలేదా అంటూ కూడా అడుగుతున్నారని ఈమె సమాధానం చెప్పారు. నవ్య స్వామి రవి కృష్ణ గురించి సోషల్ మీడియాలో ఈ విధమైనటువంటి వార్తలు వస్తున్నప్పటికీ తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అని మాత్రమే తెలియజేశారు.

సినిమాలలో బిజీగా రవికృష్ణ..

Advertisement

ఇలా ఇదివరకు పలు బుల్లితెర సీరియల్స్ లో నటించిన రవి కృష్ణ ఇటీవల బుల్లితెర సీరియల్స్ కు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈయన ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇటీవల విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవి కృష్ణ తన నటనతో పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అందుకున్న నేపథ్యంలో రవి కృష్ణ తదుపరి సినిమాలలో వరుస అవకాశాలు వస్తున్నాయి. దండోరా సినిమాతో మరో హిట్ కొట్టిన రవి కృష్ణ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇక నవ్య స్వామి కెరియర్ విషయానికి వస్తే ఈమె కన్నడ నటి అనే సంగతి అందరికీ తెలిసిందే. ఇలా కన్నడ తెలుగు సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు. నవ్య స్వామి తెలుగులో నా పేరు మీనాక్షి, ఆమె కథ, కంటే కూతురునే కనాలి ,లక్ష్మీ స్టోర్స్ వంటి తెలుగు సీరియల్స్ లో నటించారు అలాగే పలు రియాలిటీ షోలలో కూడా ఈమె పాల్గొంటూ మంచి సక్సెస్ అందుకున్నారు.

Also Read: జననాయగన్ ఎఫెక్ట్..మరో సినిమాకు విజయ్ గ్రీన్ సిగ్నల్.. డైరెక్టర్ ఎవరంటే?

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×