E-Paper
Advertisement

దళితుల ప్లాట్లపై దౌర్జన్యం.. ఎట్ల ఎర్రవల్లిలో అగ్రవర్ణాల అల్లర్లు!

దళితుల ప్లాట్లపై దౌర్జన్యం.. ఎట్ల ఎర్రవల్లిలో అగ్రవర్ణాల అల్లర్లు!
Advertisement

Dalit Attack: స్వేచ్ఛ బ్యూరో: చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్ మండలం ఎట్ల ఎర్రవల్లి గ్రామంలో దళితులపై జరిగిన దాడి తీవ్ర కలకలం రేపింది. ప్రభుత్వం ఎస్సీలకు కేటాయించిన ఇళ్ల స్థలాలను కాజేయాలన్న యత్నంలో అగ్రవర్ణాలకు చెందిన కొందరు వ్యక్తులు దళితులపై దౌర్జన్యానికి పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు.
“మా భూమి మాకు కావాలి” అని గట్టిగా అడిగినందుకే పీసరి సురేందర్ రెడ్డి ఆయన అనుచరులు మూకుమ్మడిగా దాడి చేశారని బాధితులు వాపోతున్నారు.

బీసీ భవన్ సమీపంలో..

ఎమ్మెల్యే కాలే యాదయ్య గ్రామ పర్యటన సందర్భంగా ప్లాట్ల పరిస్థితిని తెలుసుకునేందుకు వెళ్లిన దళితులు, తిరుగు ప్రయాణంలో బీసీ భవన్ సమీపంలో అడ్డగించబడి దాడికి గురైనట్లు తెలిపారు. ఈ ఘటనలో పలువురు దళితులు గాయపడగా, ప్రాణభయంతో అక్కడి నుంచి పారిపోయి ప్రాణాలు కాపాడుకున్నామని బాధితులు చెబుతున్నారు. దాడిలో పీసరి సురేందర్ రెడ్డి వర్గానికి చెందిన పలువురు పాల్గొన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Also read: న్యాయం చేయాలంటూ.. భర్త ఇంటి ముందు భార్య ధర్నా..!

పోలీసుల నిర్లక్ష్యం 

గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, పోలీసుల నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితులకు రక్షణ కల్పించి, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని షాబాద్ వ్యాప్తంగా డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ ఘటన దళితుల భద్రతపై మరొకసారి ప్రశ్నార్థకం లేవనెత్తుతోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Also read: వెన్నునొప్పితో బాధపడుతున్నారా? అది స్లిప్డ్ డిస్క్ కావచ్చు జాగ్రత్త

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×