Big Stories

Varahi Pooja: రాత్రిపూట పూజలందుకునే వారాహి

Varahi Pooja:వారాహి దేవి అమ్మవారి శక్తి రూపాల్లో ఒకటి. తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహిమాత. ఈ దేవతను రాత్రివేళల్లో పూజిస్తుంటారు.. వారాహిమాత ముఖ్య దేవతగా ప్రతిష్టించిన కొన్ని ఆలయాలలో దర్శనం సైతం రాత్రివేళల్లోనో, తెల్లవారుజామున మాత్రమే ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి, వారణాసి, మైలాపుర్ లోని వారాహి ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువ. వారణాసిలోని దశాశ్వమేథ ఘాట్ కు ఎడమ వైపున ఉంటుంది ఈ వారాహి అమ్మవారి ఆలయం ఉంది..లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు. అందుకే ఈమె ప్రస్తావన లలితాసహస్రనామంలో కూడా కనిపిస్తుంది. లలితాదేవి తరఫున పోరాడేందుకే కాదు, భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలిగా నిలిచింది .

- Advertisement -

వారాహి మాతను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని నమ్మకం. జ్ఞాన సిద్ధి కోసం, శత్రు భయం నివారణ కోసం అమ్మవారిని పూజిస్తారు. వారాహి మాతపూజతో కుండలినీ శక్తి జాగృతమవుతుందని తరతరాలుగా ఉన్న నమ్మకం. వారాహిదేవి పేర ఉన్న మూల మంత్రాలను, అష్టోత్తరాలనూ పఠిస్తే సకలజయాలూ సిద్ధిస్తాయన్నది భక్తులకి విశ్వాసం ఉంది. వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది. నల్లని శరీరఛాయను మేఘవర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారు. సాధారణంగా ఈ తల్లి వరాహ ముఖంతో, ఎనిమిది చేతులతో కనిపిస్తుంది. అభయవరద హస్తాలతో… చక్రం,నాగలి,గునపం, శంఖాలంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది. గుర్రము, సింహము, పాము, దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద సంచరిస్తుంది

- Advertisement -

హిరణ్యాక్షుడనే రాక్షసుని సంహరించి, భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి. ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు. దేవీ భాగవతం, మార్కండేయ పురాణం, వరాహ పురాణం వంటి పురాణాలలో ఈమె ప్రసక్తి కనిపిస్తుంది. అంధకాసురుడు వంటి రాక్షసులను సంహరించడంలో వారాహి పాత్ర సుస్పష్టం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News