E-Paper
Advertisement

Ram Charan Tarak: ముందుకెళ్తున్న చ‌ర‌ణ్‌… వెన‌క‌బ‌డుతున్న తార‌క్‌!

Ram Charan Tarak: ముందుకెళ్తున్న చ‌ర‌ణ్‌… వెన‌క‌బ‌డుతున్న తార‌క్‌!
Advertisement

Ram Charan Tarak: ఇద్ద‌రు యంగ్ హీరోలు క‌లిసి సినిమా చేస్తున్నారంటే, వారిద్ద‌రిని జ‌స్ట్ ఆ ఒక్క సినిమాకి మాత్ర‌మే కంపేర్ చేస్తార‌నుకుంటే త‌ప్పులో కాలేసినట్టే. ఆ సినిమాలో స్క్రీన్ స్పేస్‌, పాట‌లు, స్టైల్‌, కాస్ట్యూమ్స్, కేర‌క్ట‌ర్ డిజైన్‌, ప్ర‌మోష‌న్స్ లో ఇంపార్టెన్స్ ఇలా చాలానే ఉంటాయి. అంత‌టితో ఆగ‌దు సీన్‌. రిపీట్ అవుతుంది. ఆ సినిమా త‌ర్వాత అత‌నేం చేశాడు? ఇత‌నేం చేశాడు? అత‌ను ఎలా కెరీర్‌ని ప్లాన్ చేసుకుంటున్నాడు? ఇత‌నెలా స్పెండ్ చేస్తున్నాడు? ఇలా.. బోలెడ‌న్ని అన్న‌మాట‌. అయితే ఇప్పుడు ఈ ఫేజ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు రామ్‌చ‌ర‌ణ్ అండ్ జూనియ‌ర్ ఎన్టీఆర్‌.

ట్రిపుల్ ఆర్ త‌ర్వాత ఆచార్య చేశారు చ‌ర‌ణ్‌. ఆ త‌ర్వాత శంక‌ర్ సెట్స్ లోకి అడుగుపెట్టారు. ఉపాస‌న త‌ల్లి కాబోతుండ‌టంతో ఆమెతో టైమ్ కూడా స్పెండ్ చేస్తున్నారు. అయినా ప‌నుల‌ను ప‌క్క‌న పెట్ట‌డం లేదు. శంక‌ర్ డైర‌క్ష‌న్‌లో చేస్తున్న సినిమా 60 శాతం పూర్త‌యింద‌ట‌. త‌ర్వాత షెడ్యూల్‌ని వైజాగ్‌లో ప్లాన్ చేశారు. సో, అన్నీ కంప్లీట్ చేసి 2023లోనే సినిమాను రిలీజ్ చేస్తామ‌ని అనౌన్స్ చేశారు దిల్‌రాజు. ప్రొడ్యూస‌ర్ మాట ప్ర‌కార‌మైతే 2023లో చ‌ర‌ణ్ సినిమా రిలీజ్ అవుతుంది. ఆయ‌న‌కు ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లోనూ తండ్రిగా ప్ర‌మోష‌న్ వ‌చ్చేస్తుంది.

Advertisement

ఇప్పుడు ఫారిన్ ట్రిప్‌లో ఉన్నారు తార‌క్‌. కొర‌టాల డైర‌క్ష‌న్‌లో ఆయ‌న సినిమా ఇంకాస్టార్ట్ కానే లేదు. ఆ మాట‌కొస్తే హీరోయిన్ ఎవ‌ర‌నే విష‌యంలోనూ ఇంకా క్లారిటీ రాలేదు. ఓపెనింగ్ ఎప్పుడ‌నే విష‌యం మీద కూడా మేక‌ర్స్ కి స్ప‌ష్టత లేదు. అలాంట‌ప్పుడు 2023లో తార‌క్ సినిమా ఎప్పుడు మొద‌ల‌వ్వాలి? ఎప్పుడు షూటింగ్ చేసుకోవాలి? ఎప్పుడు రిలీజ్ కావాలి? అనేది పెద్ద ప‌జిల్‌.
రామ్ చ‌ర‌ణ్ రెండ‌డుగులు ముందుకు వేస్తుంటే,తార‌క్ మాత్రం ఇంత స్లోగా ఎందుకు ఉన్న‌ట్టు అని అనుకుంటున్నారు ఫ్యాన్స్. కాక‌పోతే ఫ్యామిలీతో స‌ర‌దాగా టైమ్ స్పెండ్ చేస్తున్నార‌న్న‌ది మాత్రం తార‌క్ విష‌యంలో ఫ్యాన్స్ కి గుడ్‌న్యూస్‌.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×