Vizag Drugs Case: విశాఖ డ్రగ్స్ కేసు వైసీపీ మెడకు చుట్టుకుంది. విశాఖ వైసీపీ స్టూడెంట్ విభాగం అధ్యక్షుడు కొండారెడ్డి అడ్డంగా బుక్కయ్యాడు. డ్రగ్స్ వస్తున్నట్లు సమాచారంతో విశాఖ రైల్వే స్టేషన్లో ఈగల్ టీమ్-టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేశాయి. ఈ మేరకు కొండారెడ్డి తోపాటు నలుగుర్ని అరెస్టు చేశారు పోలీసులు.
విశాఖలో డ్రగ్స్ కలకలం
డ్రగ్స్-గంజాయికి ఏపీని వైసీపీ కేరాఫ్‌గా మార్చిందని పదే పదే కూటమి ప్రభుత్వం చెబుతోంది. అయినా చాలామంది నమ్మలేదు. చివరకు వైసీపీ స్టూడెంట్ అధ్యక్షుడు కొండారెడ్డి డ్రగ్స్ అమ్మకాలు మొదలు పెట్టడం తీవ్ర కలకలం రేపింది. ఐటీ రాజధానిగా మారుతోన్న విశాఖలో వైసీపీ నేత డ్రగ్స్ దందా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని మాదక ద్రవ్యాల విక్రయాలు సాగిస్తున్నారు.
ఈ వ్యవహారంపై విశాఖ జిల్లా వైసీపీ స్టూడెంట్ విభాగం అధ్యక్షుడు కొండారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. బెంగుళూరు నుంచి విశాఖకు డ్రగ్స్ వస్తున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. విశాఖ రైల్వేస్టేషన్లో ఈగల్ టీమ్-టాస్క్ ఫోర్స్ టీమ్స్ సంయుక్తంగా తనిఖీలు చేపట్టాయి. దురంతో రైలులో డ్రగ్స్ తీసుకొచ్చిన చరణ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
వైసీపీ స్టూడెంట్ అధ్యక్షుడు కొండారెడ్డి అరెస్టు
అతడి బ్యాగ్‌ను తనిఖీ చేశారు. 36 ఎల్ఎస్డీ బోల్ట్స్ లభించాయి. వాటిని సీజ్ చేసిన అధికారులు, అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ స్టూడెంట్ విభాగం అధ్యక్షుడు కొండారెడ్డి కోసం బెంగళూరు నుంచి తెస్తున్నట్టు వెల్లడించాడు నిందితుడు. వెంటనే అలర్టయిన పోలీసులు కొండారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
సిటీలో ఓ విద్యా సంస్థలో చదువుతున్న హర్షవర్ధన్-సంతానం-శరత్‌లకు విక్రయించేందుకు తెచ్చినట్టు నిజాన్ని అంగీకరించాడు. దీంతో హర్షవర్ధన్ నాయుడు-శరత్‌లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పరారీలో ఉన్న సంతానం కోసం పోలీసులు గాలిస్తున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
ALSO READ: లండన్ పర్యటనలో సీఎం చంద్రబాబు-భువనేశ్వరి
కొండారెడ్డి ప్రస్తుతం మద్దిలపాలెంలో నివాసం ఉంటున్నాడు. విశాఖ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. కొండారెడ్డి అరెస్టు కాగానే.. అధినేత జగన్, మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డిలతో ఆయన దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హైదరాబాద్, బెంగళూరు, గోవాల నుంచి డగ్స్‌ను తెప్పించి విశాఖ సిటీ, ఇతర ప్రాంతాల వారికి అమ్మకాలు సాగిస్తాడని పోలీసులు గుర్తించారు.
ఈ నేపథ్యంలో కొండారెడ్డి నేరుగా దిగకుండా కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన చరణ్‌ని రంగంలోకి దించాడు. అతడి ద్వారా నగరానికి డ్రగ్స్ తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసుల విచారణలో ఇంకెన్ని కొత్త కొత్త విషయాలు బయటకు వస్తాయో చూడాలి. డ్రగ్స్ కేసులో కొండారెడ్డి అరెస్టుతో అధికార కూటమికి కొత్త అస్త్రం లభించింది.
డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ వైసీపీ నేత..
విశాఖ రైల్వే స్టేషన్ లో ఈగల్ టీమ్, టాస్క్ ఫోర్స్ పోలీసుల తనిఖీలు
దురంతో ఎక్స్ ప్రెస్ లో డ్రగ్స్ తీసుకొస్తున్న చరణ్ అనే వ్యక్తి అరెస్ట్
బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొని వచ్చి విశాఖలో విక్రయం
వైసీపీ స్టూడెంట్ వింగ్ విశాఖ అధ్యక్షుడు… pic.twitter.com/Cuaco4bhfs
— BIG TV Breaking News (@bigtvtelugu) November 3, 2025