Jayammu Nischayammu Raa:రష్మిక మందన్న (Rashmika Mandanna) తాజాగా తన ది గర్ల్ ఫ్రెండ్ (The girlfriend) మూవీ ప్రమోషన్స్ లో భాగంగా జగపతిబాబు (Jagapathi babu) హోస్ట్ గా చేస్తున్న సెలబ్రిటీ టాక్ షో జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షోకి గెస్ట్ గా వచ్చింది. అయితే తాజాగా జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షో కి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఈ ప్రోమోలో జగపతిబాబు రష్మికకి కొత్త ట్యాగ్ ఇచ్చేశారు. మరి ఇంతకీ రష్మికకు జగపతిబాబు ఇచ్చిన ఆ ట్యాగ్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
రష్మిక మందన్నా ఎంట్రీ ఇవ్వడంతోనే పుష్ప మూవీలోని శ్రీవల్లి సాంగ్ వేశారు. అక్కడికి వచ్చి అభిమానులని సర్ప్రైజ్ చేయడంతో పాటు తన ఆల్ టైం సిగ్నేచర్ మూమెంట్ ని కూడా అక్కడున్న ఆడియన్స్ కి చూపించింది. జగపతిబాబు రష్మిక ఎంట్రీ ఇవ్వడంతోనే నీకు మేము ఒక కొత్త ట్యాగ్ ఇచ్చేసాము అంటూ చెప్పి ‘గాలి పిల్ల’ అనే కొత్త ట్యాగ్ ని తగిలించేసారు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో ఫ్రెండ్ షిప్, విజయ్ సేతుపతి ఫ్యాన్,విజయ్ తలపతి ఆల్ టైం ఫ్యాన్ అంటూ చెప్పుకొచ్చారు.అలా ముగ్గురు పేర్లు చెబుతూనే విజయంతో విజయ్ ని సొంతం చేసుకున్నావా మొత్తంగా అంటూ రష్మికని ఇరుకున పెట్టేశారు. పైగా ఈ ముగ్గురు నీకు బాగా కలిసి వచ్చినట్టు ఉన్నారే అంటూ చమత్కరించారు. జగపతిబాబు మాటలకు రష్మిక నవ్వుకుంది. ఆ తర్వాత రష్మిక చిన్నప్పటి ఫోటో ని స్క్రీన్ పై చూపించారు.ఆ ఫొటోలో రష్మిక చాలా క్యూట్ గా ఉంది.ఆ తర్వాత చిన్నప్పుడు ఎలా నడిచేదో అచ్చం స్టేజ్ పై అలా నడిచి చూపించింది.
ALSO READ:The Girlfriend Business: ముగిసిన నాన్ థియేట్రికల్ బిజినెస్.. రష్మిక కెరియర్ లోనే భారీ ధర!
ఆ తర్వాత రష్మిక చేతికి ఉన్న ఉంగరాల గురించి జగపతిబాబు మాట్లాడారు.నువ్వు వేలికి పెట్టుకున్న రింగ్స్ ఏమైనా సెంటిమెంటా అని ప్రశ్నించగా.. ఈ రింగ్స్ చాలా ఇంపార్టెంట్ అంటూ రష్మిక ఆన్సర్ ఇచ్చింది. నువ్వు పెట్టుకున్న రింగ్స్ లో ఒక రింగ్ ఫేవరెట్ అయి ఉంటుంది. ఆ రింగ్ వెనుక ఒక హిస్టరీ ఉంటుంది.. అని జగపతిబాబు చెప్పడంతోనే డియర్ కామ్రేడ్ మూవీ లోని విరహం పొంగనే అంటూ బ్యాగ్రౌండ్ సాంగ్ వస్తుంది.ఆ టైంలో అక్కడే ఉన్న ప్రేక్షకులందరూ గోల గోల చేయడంతో అదంతా విన్న జగపతిబాబు వాళ్ళంతా ఏమో గోల చేస్తున్నారు వాళ్ళ బాధేంటో కనుక్కోండి అని చెప్పడంతో.. వాళ్ల గోలని నేను ఎంజాయ్ చేస్తున్నాను అంటూ రష్మిక ఆన్సర్ ఇస్తుంది.
అలా మొత్తంగా ఈ ప్రోమో రష్మిక అభిమానుల్లో కొత్త జోష్ ని నింపింది.మరి ఈ ఫుల్ ఎపిసోడ్లో రష్మికకు విజయ్ దేవరకొండకు సంబంధించి ఎంగేజ్మెంట్ మ్యాటర్ ని జగపతిబాబు బయటికి లాగుతారా.. ఇంకా ఈ ఫుల్ ఎపిసోడ్లో ఎలాంటి సీక్రెట్ విషయాలు బయట పెట్టబోతున్నారు అనేది చూడాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. బుల్లితెరపై జయమ్ము నిశ్చయమ్మురా అనే సెలబ్రెటీ టాక్ షో తో ఎంతోమంది సెలబ్రిటీలను ఆహ్వానించి సక్సెస్ గా అయ్యారు జగపతిబాబు.ఇప్పటికే ఈ షో కి నాగార్జున,నాగచైతన్య,దేవి శ్రీ ప్రసాద్, శ్రీ లీల,సందీప్ రెడ్డి వంగా,రాంగోపాల్ వర్మ,మీనా, రమ్యకృష్ణ,మహేశ్వరి,సిమ్రాన్, ప్రభుదేవా, నాని వంటి సెలబ్రిటీలు వచ్చి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టారు.అలా తాజాగా రష్మిక మందన్నా కూడా ఈ షోకి వచ్చింది.