Pratika Rawal: వన్డే మహిళల ప్రపంచకప్ 2025 టోర్నమెంట్ విజేతగా టీమిండియా నిలిచింది. ముంబై వేదికగా జరిగిన నిన్నటి ఫైనల్ మ్యాచ్ లో అద్భుతంగా రాణించి ఛాంపియన్ గా నిలిచింది టీమిండియా. దక్షిణాఫ్రికా జట్టుపై ఏకంగా 52 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా, తొలిసారి టైటిల్ అందుకుంది. ఈ విజయంతో దేశ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. టీమిండియా ప్లేయర్లు ప్రపంచకప్ అందుకుని ఫుల్ ఎంజాయ్ చేశారు. ఈ నేపథ్యంలోనే టీమిండియా ఓపెనర్ ప్రతీకా రావల్ ( Pratika Rawal) వీల్ చైర్ పై టైటిల్ అందుకున్నారు. ఈ సందర్భంగా తన జట్టు సభ్యులతో డ్యాన్సులు కూడా వేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో అలాగే ఫోటోలు వైరల్ గా మారాయి.
వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో టీమిండియా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించిన ప్రతీకా రావల్, ఈ టోర్నమెంట్ లో అద్భుతంగా రాణించారు. అయితే టీమిండియా సెమీ ఫైనల్ వెళ్లిన తర్వాత ప్రతీకా రావల్ జట్టుకు దూరమయ్యారు. బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన నామమాత్రపు మ్యాచ్ లో ప్రతీకా రావల్ కు తీవ్ర గాయం అయింది. బంతిని ఆపబోయి , కాలు విరగగొట్టుకుంది. దీంతో ఆమె వీల్ చైర్ కు పరిమితమయ్యారు. ఇప్పుడిప్పుడే ప్రతీకా రావల్ కోలుకుంటున్నారు. అయితే టీమిండియా ప్రపంచ కప్ గెలిచిన నేపథ్యంలో ముంబై గ్రౌండ్ కు వచ్చిన ప్రతీకా రావల్ కూడా సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. వీల్ చైర్ పైన ఉన్న ప్రతీకా రావల్ ను తీసుకువెళ్లారు ఓపెనర్ స్మృతి మందాన. ఆ తర్వాత టైటిల్ ప్రతీకా రావల్ చేతికి ఇచ్చారు. అనంతరం ఆమెతో డాన్స్ కూడా చేయించారు. ఈ ఊపులో ప్రతీకా రావల్ కూడా వాళ్లతో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు అలాగే ఫోటోలు వైరల్ గా మారాయి. ఇది చూసిన అభిమానులు ఫిదా అయిపోతున్నారు.
మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో అద్భుతంగా రాణించారు ప్రతీకా రావల్. ఢిల్లీకి చెందిన ఈ ప్లేయర్, ఏడు మ్యాచ్ లు ఆడింది. ఈ నేపథ్యంలోనే మొత్తం 308 పరుగులు చేసింది. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. న్యూజిలాండ్ జట్టుపైన గెలవాల్సిన కీలక మ్యాచ్ లో సెంచరీ సాధించి, టీమిండియాకు మంచి ఊపు తీసుకొచ్చింది ప్రతీకా రావల్. ఆ రోజు ఆమె ఆడకపోయి ఉంటే, టీమ్ ఇండియా సెమీ ఫైనల్ కు వచ్చేది కాదు. ఇప్పుడు ఫైనల్ కు చేరేదే కాదు. కాగా గాయం కారణంగా టీమ్ ఇండియాకు దూరమైన ప్రతీకా రావల్ స్థానంలో షఫాలీ వర్మ జట్టులోకి వచ్చి ఫైనల్ లో అద్భుతంగా ఆడింది. దీంతో టీమిండియా విజేతగా నిలిచింది.
Also Read: Kane Williamson Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ మామ..ఇక అతని శకం ముగిసింది
Smriti Mandhana taking Pratika Rawal to the stage for the Trophy celebration time. 👌♥️
– This is Beautiful..!!!! pic.twitter.com/FovVFI2buI
— Tanuj (@ImTanujSingh) November 3, 2025
Pratika Rawal was ruled out of the knockouts, but played a crucial role in this campaign 💙 pic.twitter.com/Gh5TbpBmnH
— ESPNcricinfo (@ESPNcricinfo) November 2, 2025