Dheeraj Mogilineni: సినిమా ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున పనివేళల గురించి చర్చలు జరగడమే కాకుండా ఏకంగా డిబేట్లు కూడా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే(Deepika Padukone) 8 గంటల పాటు తాను పనిచేయని చెప్పడంతో ఎంతోమంది ఈ వివాదంపై స్పందిస్తూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఈ విషయం కారణంగానే దీపికా పదుకొనే కొన్ని పాన్ ఇండియా సినిమాల నుంచి కూడా తప్పుకున్న సంగతి తెలిసిందే.. అయితే తాజాగా దీపికా పదుకొనే పనివేళ గురించి చేసిన వ్యాఖ్యల పట్ల నిర్మాత ధీరజ్ మొగిలినేని (Dheeraj Mogilineni)స్పందించారు.
ప్రస్తుతం ఈయన రష్మిక (Rashmika)హీరోయిన్ గా నటించిన ది గర్ల్ ఫ్రెండ్(The Girl Friend) సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran) దర్శకత్వంలో రష్మిక, దీక్షిత్ శెట్టి (Deekshith Shetty)ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం ధీరజ్ మొగిలినేని నిర్మాణంలో గీతా ఆర్ట్స్ సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా నవంబర్ 7వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. ఇక ఈ ప్రమోషన్లలో భాగంగా నిర్మాతకు పని వేళల గురించి ప్రశ్నలు ఎదురవడంతో ఆయన తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ దీపికా పదుకొనేకి కూడా తనదైన శైలిలోనే కౌంటర్ ఇచ్చారు.
ఈ సందర్భంగా ధీరజ్ మాట్లాడుతూ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవరైతే పనివేళ గురించి మాట్లాడారో ఆమె చేసిన కామెంట్స్ అన్ని కూడా నేను విన్నానని తెలిపారు. అయితే ఒక నిర్మాతగా ఈయన తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ సినిమా అంటే గవర్నమెంట్ జాబ్ కాదు.. ఉదయం 9నుంచి 5 వరకు షూటింగ్ చేసుకొని వెళ్తామంటే కుదరదని తెలిపారు. సినిమా అంటే ఫ్యాషన్ ఉన్నవాళ్లు సినిమా కోసం పని వేళలు లెక్కించరని తెలిపారు. సినిమాలంటే ఎంతో ఆసక్తితో మేము అర్ధరాత్రి వరకు షూటింగ్స్ చేస్తాం అలాగే తెల్లవారుజామున కూడా షూటింగ్స్ లో పాల్గొంటాము. ఇలా ఒక నిర్మాత సినిమాలపై ఆసక్తితో సినిమా చేస్తున్నారు అంటే అందులో నటించే నటీనటులు టెక్నీషియన్లు కూడా ఫ్యాషనేట్ గా ఉంటేనే మంచి అవుట్ ఫుట్ వస్తుందని ఈయన తెలిపారు.
కండిషన్లు పెడుతున్న సెలబ్రిటీలు..
ఇక తన సినిమాల విషయంలో కూడా కొంతమంది నటీనటులు ఇలాగే వ్యవహరిస్తే వారిని సినిమా నుంచి తప్పించామని ఈయన తెలిపారు. కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించే సెలబ్రిటీలు తాము 6 తర్వాత షూటింగ్స్ కి రామని, అవుట్ డోర్ షూటింగ్స్ కి రాము అంటూ కండిషన్స్ పెడుతుంటారు. ఇలాంటివారిని మొహమాటం లేకుండా తప్పించాను అంటూ ధీరజ్ తెలిపారు. ప్రస్తుతం పనివేళల గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక దీపికా పదుకొనే స్పిరిట్ సినిమాకు ఎనిమిది గంటల పాటు పనిచేయని చెప్పడంతో సందీప్ రెడ్డి ఆమెను సినిమా నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత కల్కి 2 నుంచి కూడా దీపికా పదుకొనేను తప్పిస్తూ చిత్ర బృందం అధికారకంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.