Prabhas:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పేరు సొంతం చేసుకొని.. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన బాహుబలి (Bahubali) సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా పేరు సొంతం చేసుకున్నారు ప్రభాస్ (Prabhas). ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదలై వీరికి పాన్ ఇండియా స్టార్స్ గా గుర్తింపును అందివ్వడమే కాకుండా మరొకవైపు తెలుగు సినిమా ఖ్యాతిని అమాంతం పెంచేసింది. అప్పటి నుంచి ప్రభాస్ వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఒక సినిమా తర్వాత మరొక సినిమా పాన్ ఇండియా రేంజ్ లోనే ప్రకటిస్తూ భారీ బడ్జెట్ తో సినిమాలు చేస్తూ.. 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోగా ప్రభాస్ పేరు దక్కించుకున్నారు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం ప్రభాస్ కి ఉన్న స్టార్ స్టేటస్ ను.. ఆయనకి ఉన్న ట్యాగ్ ను చూసి బాలీవుడ్ సెలబ్రిటీలకు మింగుడు పడడం లేదు అనే వార్త సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. అంతేకాదు ఇప్పుడు కోల్డ్ వార్ కూడా జరుగుతోంది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. అసలు విషయంలోకి వెళ్తే.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మార్కెట్ విస్తరణ బాలీవుడ్లో ఇప్పుడు కొంతమందికి నిద్ర పట్టకుండా చేస్తోందనే వార్త నిజం అవుతోంది. ఇటీవల సందీప్ రెడ్డి (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో వస్తున్న ‘స్పిరిట్’ సినిమాకి “ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్” అనే ట్యాగ్ పడడంతో బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ (Siddharth Anand) పరోక్షంగా షారుఖ్ ఖాన్ (Shahrukh Khan) పేరుతో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ కోల్డ్ వార్ ఎంత దూరం వెళ్తుందో చూడాలి. మొత్తానికైతే ప్రభాస్ ట్యాగ్, ఆయన మార్కెట్ విస్తరణ చూసి బాలీవుడ్లో కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు అనే వార్తలు వ్యక్తం అవుతున్నాయి. మరి దీనిపై ప్రభాస్ టీం ఏదైనా స్పందిస్తుందేమో చూడాలి.
ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ అనే సినిమా చేస్తున్నారు . ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 9వ తేదీన సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇందులో నిధి అగర్వాల్, రిద్దీ కుమార్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ప్రభాస్ కి ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి. ఇకపోతే ఈ సినిమాలో ప్రభాస్ తొలిసారి హారర్ కామెడీ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ALSO READ:HBD Shahrukh Khan: బర్తడే రోజు చిన్న మిస్టేక్.. ట్రోల్స్ ఎదుర్కొంటున్న ‘కింగ్’!
ప్రభాస్ తదుపరి చిత్రాల విషయానికి వస్తే.. హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ, స్పిరిట్, సలార్ 2, కల్కి 2 వంటి చిత్రాలలో హీరోగా నటిస్తున్నారు. ఇవన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి విడుదలకు సిద్ధమవుతున్నాయి.