E-Paper
Advertisement

Kurnool News: పోలీసుల ముందుకు వైసీపీ శ్యామల.. విచారించిన పోలీసులు, తప్పుడు ప్రచారం చేసినందుకు

Kurnool News: పోలీసుల ముందుకు వైసీపీ శ్యామల.. విచారించిన పోలీసులు,  తప్పుడు ప్రచారం చేసినందుకు
Advertisement

Kurnool News: కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయాలని వైసీపీ డిసైడ్ అయ్యిందా? ఈ క్రమంలో నేతల మెడకు కేసులు చుట్టుకుంటున్నాయా? ఈ కారణంగానే యాంకర శ్యామల చిక్కుల్లో పడ్డారా? సోమవారం కర్నూలు పోలీసుల ముందు ఆమె హాజరయ్యారా? మరి పోలీసుల విచారణలో అసలు నిజాలు చెప్పారా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.

విచారణకు హాజరైన యాంకర్ శ్యామల

Advertisement

అక్టోబరు 24న కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ప్రైవేటు ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ కేసుకు నకిలీ మద్యం కారణమంటూ వైసీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల ఆరోపణలు గుప్పించింది. దానిపై సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసింది. అలర్టయిన పోలీసులు యాంకర్ శ్యామలతోపాటు 27 మందిపై కేసు నమోదు చేశారు.

ఈ కేసు విచారణలో భాగంగా సోమవారం కర్నూలు డీఎస్పీ ఆఫీసుకు వచ్చారు. ఆమె రాక సందర్భంగా డీఎస్పీ కార్యాలయానికి భారీగా వైసీపీ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. విచారణలో సమయంలో సోషల్ మీడియా అకౌంట్ తనది కాదని చెప్పారు. తన పేరు మీద వేరే వాళ్లు పెడుతున్నారని తప్పించుకునే ప్రయత్నం చేశారట.

Advertisement

విచారణలో శ్యామల ఏం చెప్పింది?

సోషల్‌మీడియా ద్వారా యాంకర్ శ్యామల షేర్ చేసిన పోస్టులను దగ్గర పెట్టి గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేసినట్టు తెలుస్తోంది. అధికారులు అడిగిన ప్రశ్నలకు చాలావరకు తనకు తెలీదు, మరిచిపోయాను, గుర్తు లేదని చెప్పినట్టు తెలుస్తోంది.  అక్టోబరు 24న కర్నూలు జిల్లాలో వి కావేరి ట్రావెల్ బస్సు అగ్ని ప్రమాదానికి జరగడం వెనుక బెల్టు షాపులే కారణమని ప్రచారం చేశారు.

నిందితుడు అక్కడే మందు బాటిల్ తీసుకున్నట్లు ఫోటోలను సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అంతేకాదు దానికి సంబంధించి పలు కథనాలు వండివార్చారు. ఈ వ్యవహరంపై కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్లో పేరు పోగు వనములయ్య ఫిర్యాదుతో కేసు నమోదు అయ్యింది.  సోషల్ మీడియాలో అవస్తవాలను ప్రచారం చేశారని అందులో పేర్కొన్నారు. ఈ క్రమంలో దాదాపు 27 మందిపై కేసు నమోదు అయ్యింది.

ALSO READ:  జోగి రమేష్ కు మరిన్ని కష్టాలు, ఫ్యామిలీపై ఆస్తుల ధ్వంసం కేసు

ఎఫ్ఐఆర్ కాపీలో 352,353 (1)(b),196(1),61(2),BNS కింద పలు సెక్షన్లతో కేసు నమోదు చేశారు. వైసీపీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న ఏ-1 సీవీ రెడ్డి , ఏ-2 కొండూరి గోపికృష్ణ, ఏ-3 యాంకర్ శ్యామల పేర్లు ప్రస్తావించారు. వైసీపీ సోషల్ మీడియా, జగనన్న కనెక్ట్, వివిధ మీడియా ఛానళ్లపై కేసులు రిజిస్టర్ చేశారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్ ద్వారా వార్తలు ప్రసారం చేయడంతో కేసులు నమోదు అయ్యాయి. ఆ తరహా ప్రచారంపై ప్రభుత్వం సీరియస్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెల్సిందే.

Related News

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

Big Stories

Advertisement
×