The Girlfriend Business:నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్న (Rashmika Mandanna) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన విలక్షణమైన నటనతో… పాత్రకు పూర్తిస్థాయి న్యాయం చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేయడంలో తన తర్వాతే ఎవరైనా.. ముఖ్యంగా పాత్రలో లీనం అయిపోతూ.. పాత్రను ఓన్ చేసుకుంటూ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాలను అందుకుంటుంది. అంతేకాదు వందల కోట్ల క్లబ్లో చేరుతూ రికార్డు సృష్టిస్తోంది. అలాంటి ఈమె తాజాగా నటిస్తున్న చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. నవంబర్ 7వ తేదీన తెలుగు , హిందీ భాషలలో విడుదల కానుండగా.. నవంబర్ 14వ తేదీన తమిళ్, మలయాళం, కన్నడ భాషలో విడుదల కానుంది.
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ అయ్యింది. ఈ ధర చూస్తూ ఉంటే రష్మిక కెరియర్ లోనే బిగ్గెస్ట్ భారీ డీల్ అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ సినిమాకు ఈ రేంజ్ లో బిజినెస్ జరగడానికి కారణం రష్మిక మునుపటి చిత్రాల ఫలితాలే అని చెప్పడంలో సందేహం లేదు. ఇకపోతే ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ముఖ్యంగా 14 కోట్లకు ఈ సినిమా హక్కులు దక్కించుకుంది నెట్ ఫ్లిక్స్. అలాగే సాటిలైట్ ద్వారా 4 కోట్లు లభించాయి. ఆడియో ద్వారా సుమారుగా మూడు కోట్లు వసూలు చేసింది. ఇలా మొత్తంగా ది గర్ల్ ఫ్రెండ్ సినిమా నాన్ థియెట్రికల్ హక్కుల ద్వారా 21 కోట్లు రావడం ఆశ్చర్యకరమనే చెప్పాలి. ముఖ్యంగా రష్మిక కెరియర్ లోనే ఇది భారీ బిగ్గెస్ట్ డీల్ అని చెప్పవచ్చు.
ALSO READ:Nagarjuna 100: నాగ్ సరసన ముగ్గురు బ్యూటీలు.. మన్మధుడు అనిపించుకున్నాడుగా!
ది గర్ల్ ఫ్రెండ్ సినిమా విషయానికొస్తే.. గీత ఆర్ట్స్ , ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ , మాస్ మూవీ బ్యానర్లపై అల్లు అరవింద్, ధీరజ్ మొగిలినేని, విద్యా కొప్పినీడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక లీడ్రోల్ పోషిస్తూ ఉండగా.. కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్నారు. ఇకపోతే ఈ ఇద్దరి కలయికతో అటు కన్నడలో కూడా మార్కెట్ బాగా పెరగనుంది అని తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా విడుదలయ్యాకే రెమ్యూనరేషన్ తీసుకుంటానని చెప్పిన రష్మికపై కృతజ్ఞతతో ఏకంగా డబుల్ రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సిద్ధమైనట్లు నిర్మాత ధీరజ్ మొగిలినేని చెప్పుకొచ్చారు. మొత్తానికైతే రష్మిక తన నటనతో మరొకసారి సంచలనం సృష్టించబోతుందని స్పష్టం అవుతుంది. ఇక భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.