Big Stories

Wargal Saraswati Temple:- బాసర తర్వాత వర్గల్ వైపే అందరి చూపు

Wargal Saraswati Temple:- మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని వసంతపంచమి అంటారు. వసంత పంచమిని శ్రీ పంచమని అని కూడా పిలుస్తారు. వాస్తవంగా చైత్ర మాసంలో వసంత రుతువు వస్తుంది మాఘమాసంలో కాదు. అసలు . శ్రీ అంటే లక్ష్మీదేవి. కాని శ్రీ పంచమని నాడు సరస్వతికి పూజ చేయడం రెండు ఆశ్చర్యమే . సరస్వతిని ఆరాధిస్తే జ్ఞానం కలుగుతుంది. విద్య అంటే వెలుగు అని ఆర్ధం. మనిషి చేసే అన్ని పనులు కూడా జ్ఞానపూర్వకంగానే చేయాలి. ఆ జ్ఞానాన్నే విద్య అంటారు. విద్య బతుకుదెరువు చెప్పేది కాదు బ్రతుకు పరమార్ధాన్ని చాటిచెప్పేది కూడా. బతుకు పరామార్ధాన్ని తెలుసుకుని బతుకుతాడో వాడి జీవితం వసంత కాలం మాదిరిగా హాయిగా సాగిపోతుంది.

- Advertisement -

సరస్వతీ దేవీ సకల విద్యాస్వరూపిణి. ఈ దేవిని ఒక్క హిందువులు మాత్రమే కాకుండా జైనులు, బుద్దులు కూడా ఆరాధిస్తారు. కంబోడియా, థాయిలాండ్ వంటి దేశాల్లో కూడా సరస్వతీదేవిని చదువుల తల్లిగా కొలుస్తారు. భాసర వెళ్లి పిల్లలకి అక్షరాభ్యాసం చేయలేని వారి చూపు వర్గల్ సరస్వతి దేవాలయం వైపు మళ్లుతుంది

- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట దగ్గరలోనే వర్గల్ మండలంలో ఈ గుడి ఉంది. ఈ దేవాలయ అధిష్టాన దేవత సరస్వతీ దేవి. తెలుగు రాష్ట్రాల్లోని అతి కొద్ది సరస్వతీ దేవాలయాలో ఈ దేవాలయం ఒకటి. కంచి శంకర మఠం ఈ ఆలయాన్ని నిర్వహిస్తోంది. హైదరాబాద్ నుంచి కేవలం 48 కిలోమీటర్ల దూరంలో వర్గల్ సరస్వతి ఆలయం ఉఁది. ఆలయ విషయానికి వస్తే, ఈ ఆలయానికి ఎక్కువగా భక్తులు పిల్లలకి అక్షరాబ్యాసం చేయించడానికి వస్తుంటారు. ఇంకా ఈ ఆలయంలో నిత్యం తామరపూలతో అష్టోత్తర పూజ ఉంటుంది. ఇక్కడ సరస్వతి దేవి ఆలయంతో పాటు శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం, శనీశ్వరుని దేవాలయం కూడా ఉన్నాయి. సాధారణ రోజుల్లో శ్రీ విద్యా సరస్వతీ ఆలయ సందర్శకులు కనీసం రోజూ వంద మందికి తక్కువ ఉండరు

అమ్మవారు ఆరు అడుగుల చాలా భారీ విగ్రహం .వెడల్పు ముఖం వీణా ,పుస్తక దారిణి .వెండి తొడుగుతో ధగ దగా మెరిసి పోతూ తెల్లని శుభ్ర వస్త్రాలతో దర్శనమిస్తుంది. సరస్వతీ దేవి జన్మ నక్షత్రం అయిన మూలా నక్షత్రం రోజున అంటే సరస్వతీ పూజ నాడు విశేషమైన పూజలు నిర్వహిస్తారు .నవరాత్రులలో చివరి రోజున విజయ దశమి నాడు , అష్టోత్తర శత లక్ష అభిషేకం జరిపి అమ్మవారికి వివిధ విశేష అలంకారాలను చేస్తారు .చండీ హోమం ఇక్కడ మరోప్రత్యేకత.

Follow this link for more updates:- Bigtv

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News