USA: అగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల మోతమోగుతోంది. నిత్యం ఏదోఒక చోట కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి. అమాయకపు ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా కాలిఫోర్నియాలోని హాఫ్‌మూన్ బే ప్రాంతంలో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. రెండుచోట్ల జనాలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందగా.. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ఇటీవల చికాగోలో కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఇద్దరు తెలుగు విద్యార్థులపై నల్లజాతీయులు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడడంతో వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అందులో హైదరాబాద్‌కు చెందిన నందపు దేవ్‌శిష్ అనే విద్యార్థి మృతి చెందగా.. చరణ్ అనే యువకుడు చికిత్స పొందుతున్నాడు.
Indians: విదేశాలకు క్యూ కడుతున్న భారతీయులు.. దేశాన్ని వీడిన 1.8 కోట్ల మంది
Pak woman: గేమింగ్ యాప్‌లో ప్రేమాయణం.. దేశం దాటి వచ్చిన యువతి.. చివరికి..