Big Stories

Black Dress: శనివారం నాడు నలుపు దుస్తులే ధరించాలా…

Black Dress: భారతీయ సంప్రదాయంలో వారంలో ఒక్కో రోజుకి ఒక్కో ప్రత్యేకత, విశిష్టత ఉంది. వారంలో ప్రతీ రోజుకి ఆవారానికి అధిపతి అయిన గ్రహానికి తగ్గట్టు అనుకూలమైన రంగులున్న బట్టలు ధరించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. బుధవారం నాడు ఆకుపచ్చ రంగు , ఆదివారం ఎరుపు రంగు, ఇలా ప్రతీరోజు ఒక రంగు బట్టలు ధరిస్తుంటారు. ఇలా ధరించడం వెనుక కారణం ఆ గ్రహానికి సంబంధించిన రంగులతో అనుకూలత వస్తుందని నమ్మకం.

- Advertisement -

ఏడు వారాల నగలు, నవరత్నాలు ఇలాంటివి అన్నీ ఒక పద్దతి ప్రకారమే పుట్టిన అచారాలేనని పెద్దలు చెబుతున్నారు. శనివారం నాడు నల్లని దుస్తులు వేసుకుంటే మంచిదని అంటారు. నలుపు శనికి సంకేతం. ఆ దేవుడికి ప్రీతి పాత్రమైన రంగులు వేసుకుంటే సానుకూలత ఉంటుందని నమ్మకం వల్ల ఈ ఆచారం కొనసాగుతోంది.
శనిదేవుడికి ఇష్టమైన రంగైన నలుపు రంగు శనివారం నాడు వేసుకంటే శనిదేవుడి ప్రసన్నమవుతాడని నమ్మకం.

- Advertisement -

నలుపు అశుభమని కొందరి నమ్మకం. సాధారణంగా నల్ల బట్టలు వేసుకుంటే అది నిరసన తెలియచేయడానికే వాడుతుంటారు. అందుకే పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాయాల్లో నల్లని బట్టలు వేసుకోవద్దని మన పెద్దలు చెబుతుంటారు. అలాగే కొత్త బట్టలు కొనేటప్పుడు మాత్రం నలుపు రంగు వస్తువులను, బట్టలను శనివారం రోజు ఇంటికి తీసుకురావడం రావద్దని చెబుతుంటారు. అలాంటి వాటి వల్ల నెగటివ్ ఎనర్జీ కూడా ప్రవేశిస్తుందని చాలా మంది చెబుతారు. అలాగే ఇతర దేవుళ్ల పూజల్లో కూడా నలుపు రంగు బట్టలు వేసుకోద్దని చెబుతారు. ఒక్క అయ్యప్పదీక్షదారులు మాత్రమే నల్లని దుస్తులు ధరిస్తుంటారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News