దేశ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. నార్త్ లో అదిరిపోయే గర్బా డ్యాన్సులతో భక్తులు ఎంతో కోలాహలంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. దేవీ మండపాల దగ్గర గర్బా డ్యాన్సులతో ఆకట్టుకుంటున్నారు. తాజాగా ముంబైలో అమ్మవారి మండపం ముందు స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టోకు సంబంధించిన ఫుడ్ డెలివరీ బాయ్స్ అంతా కలిసి గర్బా బీట్ లకు డ్యాన్స్ చేస్తూ అలరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. తమ రోజువారీ పనులను కాసేపు పక్కనపెట్టి ఆనందంగా వేడుకలో పాల్గొని సందడి చేయడం పట్ల నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పండుగలు పోటీని పక్కన పెట్టి ప్రజలందరినీ ఒక్కటి చేస్తాయని చెప్పేందుకు ఈ వీడియో ఉదాహారణ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
@vks_lohat అనే ఇన్ స్టా యూజర్ ఫుడ్ డెలివరీ బాయ్స్ డ్యాన్స్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియోలో నలుగురు డెలివరీ రైడర్లు సాంప్రదాయ గర్బా పాటలకు ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. నేచురల్ గా ఉన్న ఈ వీడియో కాసేపట్లోనే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఫుడ్ డెలివరీ బాయ్స్ అదిరిపోయే స్టెప్పులతో ఆకట్టుకున్నారు. అక్కడ ఉన్న భక్తులతో పాటు సోషల్ మీడియాలోనూ నెటిజన్లు వీరి డ్యాన్స్ కు ఫిదా అయ్యారు. ఓవైపు ఫుడ్ డెలివరీలో ఈ నాలుగు ప్లాట్ ఫారమ్స్ పోటీ పడుతున్నా, అవేమీ పట్టించుకోకుండా అన్ని సంస్థలకు చెందిన డెలివరీ బాయ్స్ ఈ డ్యాన్స్ లో భాగం కావడం ఆకట్టుకుంటుంది.
Read Also: కొండ మీది నుంచి కొడుకును విసిరేసిన ఇన్ఫ్లుయెన్సర్, ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఇక ఈ వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రతి ఒక్కరూ ఈ వీడియోకు పాజిటివ్ గా కామెంట్స్ పెడుతున్నారు. “ఒకే ఫ్రేమ్ లో నలుగురు దిగ్గజాలు” అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. “ఎవరూ ఊహించని సీన్. అదిరిపోయింది అంతే” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. “ఫుడ్ డెలివరీ యాప్స్ వీరిని వేరు చేసినా, గర్బా నృత్యం కలిపేసింది. అందరినీ ఒక్కటి చేసింది” అని ఇంకో వ్యక్తి కామెంట్ చేశాడు. “దారులు వేరైనా అమ్మవారు వారిని కలిపింది” అని మరో వ్యక్తి కామెంట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. నలుగురు యువకులు తమ సంస్థలకు చెందిన యూనిఫామ్ లు ధరించి డ్యాన్స్ చేయడం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. అందరూ వీరిని ప్రశంసిస్తున్నారు.
Read Also: సరస్సులో పర్యాటకుల పడవ ప్రయాణం.. ఒక్కసారిగా దూసుకొచ్చిన ఏనుగు..