Mohsin Naqvi : ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ ముగిసి మూడు రోజులు గడిచినప్పటికీ ఇంకా గొడవలు మాత్రం సద్దుమణగడం లేదు. ముఖ్యంగా ఆసియా కప్ ట్రోఫీ హ్యాండోవర్ చేయడం పై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. మ్యాచ్ తరువాత ఏసీసీ చైర్మన్ మోహ్సిన్ నఖ్వీ ట్రోఫీ, మెడల్స్ తీసుకెళ్లిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ట్రోఫీ ఇవ్వడం పై నఖ్వీ స్పందించినట్టు తెలుస్తోంది. అయితే ట్రోఫీ కావాలంటే ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఏసీసీ ఆఫీస్ కి వచ్చి తీసుకోవాలి అని నఖ్వీ పేర్కొన్నారు. తన చేతుల మీదుగానే ట్రోఫీ ఇవ్వాలనే పంతంతోనే నఖ్వీ ఇలా చేస్తున్ననట్టు స్పష్టంగా అర్థమవుతోంది.
Also Read : Tilak Verma : తమ్ముడు తిలక్…ఆంధ్ర వాడి దెబ్బ.. పాకిస్తాన్ వాడి అబ్బా… జై జగన్ అంటూ
“మోహ్సిన్ నఖ్వీ ప్రవర్తన ఏసీసీ చైర్మన్ గా అస్సలు బాలేదు” అని ఓ అధికారి చెప్పారు. మీటింగ్ ప్రారంభించినప్పుడు ఆసియా కప్ 2025 గెలుచుకున్నందుకు టీమిండియాకి అభినందనలు కూడా చెప్పలేదు. ఆశీష్ షెలార్ పదే పదే గుర్తు చేసిన తరువాతనే అతను లా చేశాడు. ముఖ్యంగా భారత్ గెలిచిన విషయం, ట్రోఫీ ఎందుకు ఇవ్వలేదో అనే విషయాలను చెప్పడానికి అతనికీ అస్సలు ఇష్టంలేదు. బీసీసీఐ వాళ్లు ట్రోఫీ, మెడల్స్ ఏసీసీ ఆఫీస్ కి పంపిస్తే.. వాటిని తీసుకుంటామని చెప్పినప్పటికీ అతను తప్పించుకున్నాడు. ఫైనల్ మ్యాచ్ తరువాత విజేతకు బహుమతి ఇచ్చేందుకు దాదాపు గంట సేపు ఆలస్యం కావడానికి కూడా నఖ్వీనే కారణమని తెలిసింది. ముఖ్యంగా భారత్ ఒప్పుకున్న.. ఒప్పుకోకపోయినా తానే ట్రోఫీని ఇవ్వాలని నఖ్వీ పట్టుబడినట్టు సమాచారం. నఖ్వీ ఆలస్యం చేయడం పై రవిశాస్త్రీ వంటి మాజీ ఆటగాళ్లు కూడా చాలా కోపపడ్డారట.
Also Read : Vaibhav Suryavanshi : ఆస్ట్రేలియాపై సూర్యవంశీ సూపర్ సెంచరీ… ఏకంగా 8 సిక్సర్లు
వాస్తవానికి ఈ ట్రోఫీ గొడవ కేవలం ఒక్కసారి మాత్రమే మొదలవ్వలేదు. టోర్నమెంట్ అంతటా భారత్, పాకిస్తాన్ తో హ్యాండ్ షేక్ ఇవ్వకుండా ఓ ప్రత్యేక విధానాన్ని పాటించింది. మాజీ ఆటగాళ్లు, టీవీ నిపుణులు, సామాన్యుల మధ్య పెద్ద చర్చకు దారి తీసింది. భారత జట్టు తొలుత ఐక్యతతో వ్యవహరించినప్పటికీ పాకిస్తాన్ ఆటగాళ్లు మైదానంలో ఇండియాను రెచ్చగొట్టేలా చెడ్డ చేష్టలు చేసారు. దీనికి ఆటగాళ్లకు జరిమానాలు కూడా విధించారు. ఫైనల్ రాత్రి కెప్టెన్ లను ఇద్దరూ వేర్వేరు వ్యక్తులు ఇంటర్వ్యూ చేయడం వంటివి ఉద్రిక్తతను మరింత పెంచాయి. చాలా కోపతాపాలతో సాగిన ఆసియా కప్ ముగిసినా బీసీసీఐ ఇప్పుడూ మెడల్స్ ట్రోఫీని ఏసీసీ ద్వారా నియమాల ప్రకారం అందజేయాలని కోరుకుంటుంది. ఇప్పటికీ ఈ గొడవకు ప్రధాన కారణం నఖ్వీనే. 2025 ఆసియా కప్ భారత్ గెలిచినందుకు ఎంత గుర్తుంటుందో.. దాని చుట్టూ జరిగిన ఈ గొడవలు, రాజకీయాల వల్ల కూడా అంతే గుర్తుండిపోతుంది. వాస్తవానికి పహల్గామ్ ఉగ్రవాదులు దాడి చేయడంతో.. భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ చేపట్టినప్పటి నుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మరోవైపు పాకిస్తాన్ మంత్రిగా, ఏసీసీ చీఫ్ గా వ్యవహరిస్తున్నాడు నఖ్వీ.