Vaibhav Suryavanshi : టీమిండియా అండర్ 19 ఆటగాడు వైభవ్ సూర్యవంశీ సరిగ్గా ఏడాది కిందట ఆస్ట్రేలియా జట్టుపై సెంచరీ చేశాడు. అక్టోబర్ 01, 2024లో సెంచరీ చేసినట్టుగానే 2025లో సెంచరీ సాధిస్తాడా..? అభిమానులు నిన్న, మొన్న ప్రశ్నించారు. తాజాగా సెంచరీ చేసి వారి ప్రశ్నలన్నింటికీ సరైన సమాధానమే చెప్పాడు. వారి డౌట్ ను క్లియర్ చేశాడు వైభవ్ సూర్యవంశీ. ఇండియా అండర్ 19 టూర్ ఆఫ్ ఆస్ట్రేలియాలో భాగంగా ఈ యంగ్ స్టార్ అదురగొట్టారు. ఆస్ట్రేలియా పై తొలి యూత్ టెస్ట్ లో కేవలం 78 బంతుల్లోనే సెంచరీ చేశాడు. భారత్ తరపున యూత్ టెస్ట్ ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా తన కెప్టెన్ ఆయూశ్ మాత్రే రికార్డును బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్ లో 86 బంతుల్లో 8 సిక్స్ లు, 9 ఫోర్లు కలిపి మొత్తం 113 పరుగులు చేశాడు. వైభవ్ తన కెరీర్ లో రాజస్థాన్ తరపున ఐపీఎల్ లో సెంచరీ, ఇంగ్లండ్ పై యూత్ వన్డే లో శతకం, ఇప్పుడు ఆస్ట్రేలియా పై యూత్ టెస్ట్ లో కూడా సెంచరీ చేశాడు.
Also Read : Tilak Verma : తమ్ముడు తిలక్…ఆంధ్ర వాడి దెబ్బ.. పాకిస్తాన్ వాడి అబ్బా… జై జగన్ అంటూ
ఇక ఇప్పటికే ఆస్ట్రేలియా పై 3 వన్డేలు గెలిచిన టీమిండియా అండర్ 19 జట్టు ఇప్పుడు టెస్ట్ సిరీస్ పై కన్నేసింది. వైభవ్ సూర్యవంశీ సరిగ్గా ఏడాది కిందట అంటే అక్టోబర్ 01, 024న ఆస్ట్రేలియన్ అండర్-19 జట్టు పై ఏమి చేశాడంటే..? ఆ మ్యాచ్ వైభవ్ సూర్యవంశీకి చాలా ప్రత్యేకమైనదనే చెప్పాలి. ఎందుకంటే..? ఇది అండర్ 19 మల్టీ డే ఫార్మాట్ లో అతని ఆరంగేట్రం. కానీ వైభవ్ సూర్యవంశీ తన ఆరంగేట్ర మ్యాచ్ లోనే తన ప్రభావాన్ని చూపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియన్ బౌలర్ల పై విరుచుకుపడ్డాడు. కేవలం 62 బంతుల్లోనే 14 ఫోర్లు, 4 సిక్సర్లతో మొత్తం 104 పరుగులు చేశాడు. ఇక ఆ ఇన్నింగ్స్ తో సూర్యవంశీ ప్రపంచ రికార్డును కూడా సృష్టించాడు.
Also Read : Saeed Ajmal Cheque : పాక్ PM ఇచ్చిన చెక్కులు బౌన్స్..ఆ ప్లేయర్ సంచలనం
అంతర్జాతీయ యూత్ టెస్ట్ మ్యాచ్ ల్లో సెంచరీ చేసిన ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన బ్యాట్స్ మెన్ గా నిలవడం విశేషం. తాజాగా మళ్లీ సరిగ్గా అదే తేదీన సంవత్సరం తరువాత అదే ఆస్ట్రేలియా జట్టుపై సెంచరీ చేయడం విశేషం. ఆస్ట్రేలియా గడ్డ పై ఈ మ్యాచ్ లో వైభవ్ చేసిన సెంచరీ అత్యంత ఫాస్టెస్ట్ సెంచరీ. యూత్ టెస్ట్ ల్లో వేగవంతమైన రికార్డును సైతం సమానం చేశాడు. న్యూజిలాండ్ దిగ్గజం బ్రెండన్ మెక్ కల్లమ్ తరువాత యూత్ టెస్ట్ లో రెండు శతకాలను 100 లోపు బంతుల్లో సాధించిన ఆటగాడిగా నిలిచాడు. వైభవ్ 2024 చెన్నైలో ఇదే ఆస్ట్రేలియా అండర్ 19 జట్టుపై 58 బంతుల్లోనే సెంచరీ చేశాడు. తాజాగా సెంచరీ చేయడంతో మెక్ కల్లమ్ రికార్డును సమం చేశాడు.