BigTV English

Bigg Boss 9 Promo: గోల్డెన్ ఆపర్చునిటీ.. పాపం ఆ కంటెస్టెంట్ బలి!

Bigg Boss 9 Promo: గోల్డెన్ ఆపర్చునిటీ.. పాపం ఆ కంటెస్టెంట్ బలి!

Bigg Boss 9 Promo:తాజాగా బిగ్ బాస్ 9వ సీజన్ కి సంబంధించి నాలుగవ వారం ఊహించని టాస్కులతో కంటెస్టెంట్ ల మధ్య గొడవలు, మనస్పర్ధలు తలెత్తుతున్నాయని చూసే ఆడియన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇక నిన్నటి వరకు ఇమ్యూనిటీ టాస్క్ నిర్వహించగా.. ఇప్పుడు గోల్డెన్ ఆపర్చునిటీ అంటూ మరో టాస్క్ తో కంటెస్టెంట్స్ ముందుకు వచ్చారు బిగ్ బాస్. అయితే అనూహ్యంగా ఒక టాలెంటెడ్ కంటెస్టెంట్ టాస్క్ నుంచీ ఎలిమినేట్ అవ్వడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరి ఈ ప్రోమోలో ఏముందో ఇప్పుడు చూద్దాం.


గోల్డెన్ ఆపర్చునిటీ అంటూ మరో కొత్త టాస్క్..

తాజాగా 24వ రోజుకు సంబంధించిన మొదటి ప్రోమోని నిర్వాహకులు విడుదల చేశారు. అందులో బిగ్ బాస్ మాట్లాడుతూ మీ అందరికీ ఒక గోల్డెన్ ఆపర్చునిటీ కలిగిస్తున్నాను. స్టార్ట్ బజర్ మొదలవగానే.. టీం లీడర్స్ అందరూ సమయానుసారం చెప్పిన కలర్ బాల్స్ ని ఆ నెట్ నుండి బయటకు పడేయాలి అంటూ బజర్ మోగించారు. కెప్టెన్సీ కంటెండర్ షిప్ మాత్రమే కాదు ఎన్నో లగ్జరీ బహుమతులు కూడా ఉంటాయి అంటూ తెలిపారు బిగ్ బాస్. ఇక బజర్ మోగగానే కంటెస్టెంట్స్ అందరూ ఎవరికి వారు పోటీపడి మరీ బిగ్బాస్ చెప్పినట్టుగా ఆ కలర్ బాల్స్ ను తమ బాస్కెట్ లో వేసుకున్నారు.

పాపం కంటెస్టెంట్ బలి..


అయితే కళ్యాణ్.. తనూజ మొహం మీదే కొట్టడంతో ఆమె సీరియస్ అవుతూ ఇలా మొహం మీద కొడుతున్నాడు అంటూ చెబుతుంది. తర్వాత బ్లాక్ కలర్ బాల్ ని బయటకు అనుకోకుండా తీస్తారు. దీంతో బిగ్ బాస్ మాట్లాడుతూ.. బ్లాక్ బాల్ చెప్పకుండా బయటికి ఏ టీమ్ వారు తీసారో ఆ టీంలోని ఒక వ్యక్తిని ఎలిమినేట్ చేయండి అని చెప్పగా… కెప్టెన్ పవన్ తనూజ పేరు చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. మధ్యలో కళ్యాణ్ కల్పించుకొని టీం ప్లేయర్స్ ని పంపించాలి సపోర్టర్స్ ని కాదు అంటూ కళ్యాణ్ గట్టిగా వారించినా.. పవన్ మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా తనూజాను ఎలిమినేట్ చేశారు.. కానీ కళ్యాణ్ మాత్రం గట్టిగానే తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. అసలు టీం ప్లేయర్ని కాకుండా సపోర్టర్ ని ఎలా ఎలిమినేట్ చేస్తారు అంటూ వాదించాడు.. దీంతో ఇది చూసిన ఆడియన్స్ అందరు పాపం తనూజ బలైపోయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

also read:IBomma Counter: బరాబర్ పైరసీ చేస్తాం… పోలీసులకు ఐ బొమ్మ స్ట్రాంగ్ కౌంటర్!

నాలుగవ వారం ఎలిమినేషన్ ఎవరంటే?

బిగ్ బాస్ కార్యక్రమం విషయానికి వస్తే.. ఎప్పటికప్పుడు సరికొత్త టాస్కులతో ప్రేక్షకులను అలరిస్తున్నారని చెప్పవచ్చు. ఇప్పటికే తెలుగులో ఎనిమిది సీజన్లు పూర్తికాగా.. ఇప్పుడు 9వ సీజన్ కూడా ప్రారంభమైంది. అందులో భాగంగానే మూడు వారాలు పూర్తి కాగా.. నాలుగవ వారం కూడా మిడిల్ కి వచ్చిన విషయం తెలిసిందే. ఇక మరొకవైపు 6 మంది కామనర్స్ హౌస్ లోకి అడుగుపెట్టగా.. దాదాపు 9 మంది సెలబ్రిటీలు హౌస్ లోకి వచ్చారు. అందులో ఒక సెలబ్రిటీ, ఇద్దరు కామనర్స్ లిమినేట్ అవ్వగా.. మరొక కామనర్ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఆరు మంది నామినేషన్ లో ఉండగా.. ఈసారి శ్రీజ, దివ్య నిఖిత డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

Related News

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బిగ్ బాస్ ప్రియా శెట్టి.. కానీ?

Bigg Boss 9: నామినేషన్ లో 6గురు..గురి వారి మీదే!

Bigg Boss Promo: దివ్య ను టార్గెట్ చేశారా? ఆ కామనర్ దగ్గర హౌస్ మేట్స్ నిజంగానే తోలుబొమ్మలా?

Bigg Boss 9 Promo: మళ్లీ నోరు జారిన హరిత హరీష్.. ఈసారి బ్యాండ్ బాగానే!

Bigg Boss 9 Promo: నామినేషన్ రచ్చ షురూ.. వ్యాలీడ్ పాయింట్స్ చెప్పండమ్మా!

Bigg Boss 9: సంజన పోపు ఘాటు దెబ్బకు తనూజ అవుట్.. మాస్క్ మ్యాన్ సైలెంట్ కౌంటర్..

Bigg Boss 9: వారధి కట్టు.. ఇమ్మ్యూనిటీ పట్టు.. ట్విస్ట్ అదిరింది.. నామినేషన్స్ నుంచి వారిద్దరు సేవ్

Big Stories

×