Chittoor News: టెక్ యుగంలో యువతీయువకుల వ్యవహారశైలి, అభిరుచులు మారాయి. అరచేతిలోకి స్మార్ట్ ఫోన్ వచ్చాక వారివారి ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి. కొన్ని విషయాలకు తల్లిదండ్రులు ససేమిరా అంటున్నారు. చివరకు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా అలాంటి ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది.
ఒకప్పుడు పెద్దలు కుదిర్చిన పెళ్లిని చేసుకునేవారు అమ్మాయి. అంతా తల్లిదండ్రులు నిర్ణయంపై డిసైడ్ అయ్యేవారు. ప్రస్తుతం పరిస్థితి మారింది. చాలామంది యువతీ యువకులు పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడం లేదు. ఏదో విధంగా పేరెంట్స్‌ని కన్వీన్సు చేసి ప్రేమ వివాహం చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు.
చిత్తూరు జిల్లా వి.కోట మండలం పట్రపల్లి గ్రామంలో ఓ యువతి అలాగే చేసింది. అందుకు పేరెంట్స్ అంగీకరించలేదు. ఫలితంగా ఆత్మహత్యకు పాల్పడింది. పట్రపల్లి గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతి శోభకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. ఆ యువకుడు ఎవడు, ఎక్కడ ఉంటాడు అనే వివరాలు ఏమీ తెలీదు. కేవలం సోషల్ మీడియా ద్వారా పరిచయం పెరిగింది.
ఆ తర్వాత స్నేహంగా మారింది. చివరకు ప్రేమకు దారి తీసింది. దాన్ని మూడుముళ్ల బంధంగా మార్చుకోవాలని యువతి ఆలోచించింది. ఎన్నోన్నో డ్రీమ్. ఎప్పుడు చూసినా నిత్యం ఫోన్‌లో ఉండడంతో పేరెంట్స్‌కి అనుమానం వచ్చింది. చివరకు కూతురు విషయం బయటపడింది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన వ్యక్తితో ప్రేమలో పడిందని తెలిసింది.
ALSO READ: ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. క్యూలైన్ లో తోపులాట
అతడ్ని పెళ్లి చేసుకుంటానని శోభ తల్లిదండ్రులతో చెప్పింది. అందుకు తల్లిదండ్రులు ఏ మాత్రం అంగీకరించలేదు. ఫలితంగా కూతుర్ని మందలించారు. ఈ వ్యవహారంపై మంగళవారం ఇంట్లో తల్లిదండ్రులతో మరోసారి గొడవ జరగింది. మనస్థాపానికి గురై ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది శోభ.
ఉన్నట్లుండి కూతురు ఈ లోకాన్నివిడిచి పెట్టడంపై షాకయ్యారు తల్లిదండ్రులు. కూతుర్ని ఆ విధంగా చూసి కన్నీరుమున్నీరు అయ్యారు. ఇంతకీ చనిపోయిన శోభ ఏం సాధించింది? పెద్దలకు చెప్పి ఏదో విధంగా ఒప్పించాలి. చనిపోయి ఏం సాధించింది? కన్న తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చింది.