Deepika Padukone:ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న దీపికా పదుకొనే గత కొంతకాలంగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. పనివేళల విషయంలో ఆమె తీసుకున్న నిర్ణయం, పారితోషకం విషయంలో డిమాండ్ అన్నీ కూడా ఈమెను వార్తల్లో నిలిపేలా చేశాయి. అటు టాలీవుడ్ మొదలు ఇటు బాలీవుడ్ వరకు ఈ విషయాలపై చాలామంది చర్చలు మొదలుపెట్టారు కూడా. నిజానికి ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin)దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కల్కి2898 ఏడి. ఈ సినిమాలో మొదట దీపిక అవకాశం అందుకుంది. ఇందులో సుమతీ పాత్రలో చాలా అద్భుతంగా నటించింది కూడా. దీంతో సీక్వెల్ లో కూడా నటిస్తుంది అని వార్తలు వినిపించాయి.
ఆ విషయం పక్కన పెడితే.. కల్కి 2898 ఏడి తర్వాత సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో మళ్లీ ప్రభాస్ కి జోడిగా స్పిరిట్ (Spirit) మూవీలో అవకాశాన్ని అందుకుంది దీపిక. అయితే ఆ సమయంలో రోజుకు కేవలం ఎనిమిది గంటలు మాత్రమే పనిచేస్తానని డిమాండ్ చేయడం.. పైగా అత్యధిక పారితోషకం కోరడంతో సందీప్ రెడ్డి వంగ ఈమెను సినిమా నుండి తప్పించి.. యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి (Tripti dimri)ని రంగంలోకి దింపారు..అదే సమయంలో దీపిక పిఆర్ టీం సందీప్ రెడ్డి పై చేసిన కామెంట్లకు ఆయన కౌంటర్ ఇస్తూ దీపిక డర్టీ పి ఆర్ గేమ్స్ ఆడుతోంది అంటూ సోషల్ మీడియా వేదికగా సంచలనం సృష్టించారు. అలా వీరిద్దరి మధ్య డైరెక్ట్ సంభాషణ లేకపోయినా ఇన్ డైరెక్ట్ కామెంట్లతోనే వార్తల్లో నిలిచారు.
ALSO READ:Idli Kottu OTT: ధనుష్ ఇడ్లీకొట్టు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!
దీపికా కండిషన్స్ కి రెండో మూవీలో కూడా నో ఛాన్స్..
దీనికి తోడు ఇప్పుడు కల్కి సీక్వెల్ నుండి కూడా దీపికాను తప్పిస్తూ మేకర్స్ అధికారిక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీంతో దీపికాను సినిమా నుంచి తప్పించడం పై అనేక ఊహగానాలు వ్యక్తమయ్యాయి. మొదటి భాగానికి తీసుకున్న రెమ్యూనరేషన్ కంటే 25% ఎక్కువ అడిగినట్లు, పైగా రోజుకు కేవలం 7 గంటలు మాత్రమే షూటింగ్లో పాల్గొనాలని పట్టు పట్టినట్లు సమాచారం. దీంతో ఈమెను సినిమా నుండి తప్పిస్తూ.. అసలు విషయం చెప్పకుండా తప్పించినట్లు తెలిపారు.
అత్యంత ప్రజాదారణ పొందిన నటిగా దీపిక..
ఇలా వరుసగా అటు సందీప్ రెడ్డి వంగ నుండీ ఇటు కల్కి2 టీం నుంచి వ్యతిరేకతలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తాజాగా ఐఎండిబి విడుదల చేసిన “25 ఇయర్స్ ఆఫ్ ఇండియన్ సినిమా” నివేదికలో అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన నటీనటుల జాబితాలో దీపికా నాలుగవ స్థానాన్ని దక్కించుకుంది. పైగా గత 25 సంవత్సరాలలో అత్యంత ప్రజాదారణ పొందిన 130 చిత్రాలను విశ్లేషించగా.. అందులో పది చిత్రాలు ఒక్క దీపికావే కావడం విశేషం. ఇక ఈ జాబితాలో షారుక్ ఖాన్ అగ్రస్థానంలో ఉండగా.. అమీర్ ఖాన్, హృతిక్ రోషన్ తర్వాత దీపికా స్థానాన్ని దక్కించుకున్నారు. అలాగే సల్మాన్ ఖాన్, అమితాబ్ వంటి వారు కూడా ఇందులో చేరారు.
సందీప్ కి ఇన్ డైరెక్ట్ కౌంటర్ ఇచ్చిన దీపిక..
ఇకపోతే ఈ జాబితాలో చోటు దక్కించుకోవడంపై దీపిక స్పందిస్తూ..” విజయవంతం కావడానికి మహిళలు తమ వృత్తిని ఎలా నడుపుకోవాలో తరచుగా చెప్పేవారని, అయితే తాను దానిని సవాలు చేయడానికి నిర్ణయించుకున్నాను అని నొక్కి చెప్పుకొచ్చింది. నేను నా సినిమా ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు ఒక మహిళ విజయవంతం కావాలి అంటే తన కెరీర్ ను ఎలా నడిపించాలి అనే విషయాలు నాకు తరచుగా చెప్పేవారు. మొదటి నుంచి నేను ప్రశ్నలు అడగడానికి, నిబంధనలను సవాలు చేయడానికి, ఇబ్బందికరమైన మార్గంలో నడవడానికి ఎప్పుడు భయపడలేదు. నా కుటుంబం, అభిమానులు, సహచరులు నాపై ఉంచిన నమ్మకం, నేను తీసుకున్న నిర్ణయాలు నాకు శక్తినిచ్చాయి. ఆ తర్వాత వారికి కూడా ఇది దారిని చూపిస్తాయని ఆశిస్తున్నాను. ఇక ఎలాంటి సవాలునైనా నేను ధైర్యంగా ఎదుర్కొంటాను” అంటూ తెలిపింది. ఇది చూసిన నెటజన్స్ సందీప్ కి ఇన్ డైరెక్ట్ కౌంటర్ ఇచ్చింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.