Flipkart Offers: ఆఫర్లతో అదరగొడుతున్న ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. అధికారికంగా ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన ప్రకారం ఈ సేల్ అక్టోబర్ 2తో ముగియనుంది. అంటే ఇక కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ సేల్ క్లోజింగ్ డేట్‌తో పాటు, చివరి రోజుల్లో అందించనున్న స్పెషల్ లాస్ట్ డేస్ డీల్స్‌ను కూడా ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్, హెడ్‌ఫోన్స్, ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయెన్స్‌లు (గృహోపకరణాలు)పై భారీ తగ్గింపులు ఇవ్వబడుతున్నాయి. మీరు బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ కోసం చూస్తుంటే… ఈరోజు అందిస్తున్న ఆఫర్స్ తప్పకుండా పరిశీలించవచ్చు.
ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లాస్ట్ డేస్ డీల్స్?
సేల్ క్లోజింగ్ డేట్ ప్రకటించే ముందు నుంచే ఫ్లిప్ కార్ట్ కొన్ని బెస్ట్ స్మార్ట్ ఫోన్ & హెడ్ ఫోన్ డీల్స్‌ను యూజర్లకు అందించింది. ముఖ్యంగా 20 వేల రూపాయల కంటే తక్కువ బడ్జెట్‌లో చూసే వారికి ఇవి సరైన ఎంపికలు అవుతాయి. ఇప్పుడు ఆ ఆఫర్స్ వివరాలు చూద్దాం.
CMF నథింగ్ ఫోన్ 2 ప్రో
ఫ్లిప్ కార్ట్ సేల్‌లో అందుబాటులోకి వచ్చిన ఈ CMF లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం రూ. 16,999 ఆఫర్ ధరలో లభిస్తోంది. అదనంగా ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే మరో రూ. 1,500 డిస్కౌంట్ లభిస్తుంది. అంటే కేవలం రూ.15,499కే ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. స్టన్నింగ్ డిజైన్, కెమెరా క్వాలిటీ, పనితీరులో ఈ ఫోన్ బడ్జెట్ రేంజ్‌లో బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది.
Also read: October Bank Holidays: అక్టోబర్‌లో 21 రోజుల బ్యాంక్ హాలిడేలు.. పూర్తి లిస్ట్ ఇదిగో!
వన్‌ప్లస్ నార్డ్ CE5 5జి
ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన ఈ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ కూడా ఫ్లిప్ కార్ట్ సేల్‌లో అందుబాటులో ఉంది. దీని ఆఫర్ ధర రూ.23,746. కానీ ICICI క్రెడిట్ కార్డ్ ఆఫర్ వాడితే మరో రూ. 1,500 తగ్గింపు లభిస్తుంది. అంటే మొత్తంగా ఈ ఫోన్‌ను కేవలం రూ.22,246 ధరకే కొనుగోలు చేయవచ్చు. వన్‌ప్లస్ ప్రీమియం ఫీచర్లు, స్మూత్ పనితీరు కోరుకునే వారికి ఇది మంచి డీల్ అని చెప్పొచ్చు.
శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈ 5జి
ఈసారి ఫ్లిప్ కార్ట్‌లో భారీ డిస్కౌంట్‌తో అందుబాటులోకి వచ్చిన మరో మోడల్ శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈ 5జి. దీని ఆఫర్ ధరను ఫ్లిప్ కార్ట్ కేవలం రూ.28,499గా ఫిక్స్ చేసింది. అదనంగా 10శాతం బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. కానీ ఈ ఆఫర్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ముగిసే వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. శామ్‌సంగ్ ప్రీమియం ఎక్స్‌పీరియెన్స్‌ను బడ్జెట్ రేంజ్‌లో అనుభవించాలనుకునే వారికి ఇది అద్భుతమైన అవకాశం. కాబట్టి ఇంకా షాపింగ్ పూర్తి చేయని వారు, ఈ లాస్ట్ డేస్ ఆఫర్స్‌ను మిస్ అవ్వకండి. స్మార్ట్ ఫోన్స్, హెడ్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్‌పై లభిస్తున్న ఈ స్పెషల్ డిస్కౌంట్లు త్వరగా క్లిక్ చేయకపోతే, స్టాక్ అవుట్ అయ్యే అవకాశమే ఎక్కువ!