IBomma Counter:దేశ సినీ పరిశ్రమను పట్టిపీడిస్తున్న పైరసీ అనే అతిపెద్ద భూతాన్ని పట్టుకోవడానికి తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏకంగా రూ.2కోట్లు ఖర్చుపెట్టి అధునాతన పరికరాలతో దేశంలో అతిపెద్ద ముఠాని పోలీసులు పట్టుకున్నారు. త్వరలోనే అతిపెద్ద పైరసీగా పేరు సొంతం చేసుకున్న ఐబొమ్మ హెడ్ ని కూడా అరెస్ట్ చేస్తాము అని, ఐపీఎస్ సివి ఆనంద్ ఇటీవల తెలిపారు. అంతేకాదు సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు చిరంజీవి (Chiranjeevi ), వెంకటేష్ (Venkatesh), నాగార్జున (Nagarjuna), దిల్ రాజు(Dilraju ) వంటి ప్రముఖుల సమక్షంలో భేటీ నిర్వహించి.. పైరసీ ఎలా జరుగుతోంది? పైరసీని ఎలా అరికట్టాలి? అనే విషయాలపై కూడా చర్చించారు.
సైబర్ క్రైమ్ పోలీసులకే ఐబొమ్మ సవాల్..
ఈ విషయాలను ఐపీఎస్ CV ఆనంద్ సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేయడంతో.. ఐబొమ్మ రియాక్ట్ అయ్యింది. బరాబర్ పైరసీ చేస్తాం అంటూ ఒక నోట్ కూడా విడుదల చేసింది. ఇక ఆ నోట్లో పొందుపరిచిన అంశాల విషయానికి వస్తే.. “ఐబొమ్మ మీద మీరు ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాం.. డిస్ట్రిబ్యూటర్స్ కి ప్రింట్ అమ్మిన తర్వాత మీరు ఏం పట్టనట్టు కెమెరా ప్రింట్స్ తీసిన వాళ్ల మీద కాకుండా మీ ఓటీటీ రెవెన్యూ కోసం ఆలోచిస్తూ మా మీద ఫోకస్ పెట్టారు.
also read:Deepika Padukone: ఇట్స్ రివేంజ్ టైమ్.. సందీప్ కి దీపిక స్ట్రాంగ్ కౌంటర్!
హీరోలకు అంత రెమ్యూనరేషన్ అవసరమా? అది మీ కొడుకు అయినా ఎవరు అయినా?
సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు.. వాళ్ళు ఏమైపోతారు అని కబుర్లు చెప్పకండి. వాళ్ళకి మీరు ఇచ్చే అమౌంట్ ఏ కూలి పని చేసినా వస్తాయి. కానీ మీ హీరోకి, హీరోయిన్ కి వస్తాయా ?
సినిమా బడ్జెట్లో ఎక్కువ శాతం రెమ్యూనరేషన్ , విదేశాలలో షూటింగ్లకు, ట్రిప్స్ కి ఖర్చు పెడుతున్నారు. ప్రొడక్షన్ బాయ్స్ నుంచి లైట్ బాయ్స్ వరకు ఎంత ఖర్చు పెడుతున్నారు? ఇండియాలో షూటింగ్ చేస్తే బడ్జెట్ తగ్గుతుంది కదా.. ఇక్కడి వాళ్లకి ఉపాధి కూడా దొరుకుతుంది కదా!
అనవసర బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్ రికవరీకి దానిని మా మీద రుద్ది ఎక్కువకే అమ్ముతున్నారు. డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్ ఓనర్స్ ఆ అమౌంట్ ని కలెక్ట్ చేసుకోవడానికి టికెట్ అమౌంట్ పెంచుతున్నారు. చివరికి మధ్యతరగతి వాడే బాధితుడు అవుతున్నాడు. మా వెబ్సైట్ మీద ఫోకస్ చేయడం ఆపండి.. లేదంటే మీ మీద మేము ఫోకస్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ వేరే కెమెరా ప్రింట్స్ రిలీజ్ చేసే వెబ్సైట్ ల మీద మీ దృష్టి పెట్టండి. ఐబొమ్మ అన్నది సిగరెట్టు నుంచి ఈ – సిగరెట్టుకి యూజర్స్ ను మళ్ళించే ప్రక్రియ. మీ యాక్షన్ కి మా రియాక్షన్ కూడా ఉంటుంది. మేము ఏ దేశంలో ఉన్నా భారతదేశం, అందులో తెలుగు వాళ్ల కోసమే ఆలోచిస్తాం ” అంటూ కౌంటర్ వేసింది. ఈ మేరకు ఒక పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.
పైరసీ వెబ్సైట్ పై నెటిజన్స్ ఫైర్.
ఇకపోతే ఐ బొమ్మ ఇలాంటి ప్రకటన చేయడంతో సినిమా లవర్స్ , ఇండస్ట్రీ జనాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సినిమా వాళ్లు పైరసీ వద్దు అనుకుంటున్నారు. దీనికి తోడు అసలే పైరసీ చేసి బ్రతికే ఇలాంటి సైట్లకు ఇంత ధైర్యం ఎక్కడిది? ఇలాంటి వాళ్ల వల్లే కదా ఇండస్ట్రీ భారీ స్థాయిలో నష్టపోతోంది? అంటూ కూడా ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా సైబర్ క్రైమ్ పోలీసులకే కౌంటర్ ఇచ్చేలా ఐ బొమ్మ మాట్లాడడం ఇప్పుడు మరింత తప్పు. మరి ఇంత డేర్ స్టెప్ తీసుకున్న ఐ బొమ్మపై సైబర్ పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి.
పోలీసులకు 'ఐబొమ్మ' వార్నింగ్ #ibomma #Notice #IBommaNotice #TelanganaPolice pic.twitter.com/so0X9FAIrW
— BIG TV Cinema (@BigtvCinema) October 1, 2025