Big Stories

Dark Neck : మెడ నలుపును పోగొట్టే చిట్కాలు

Dark Neck:మనం సాధారణంగా ముఖం, జుట్టు సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తుంటాం. కానీ మెడ విషయానికి వస్తే దాన్ని పట్టించుకోరు. దీంతో ఆ భాగంలో నల్లగా మారుతుంది. మెడ భాగంలో ఏర్పడిన నల్లధనాన్ని పోగొట్టేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవి ఇప్పుడు తెలుసుకుందాం. కలబంద గుజ్జులో అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మన శర్మాన్ని కాపాడుతాయి. పిగ్మెంటేషన్ కూడా తగ్గిస్తాయి. దీంతో చర్మం కాంతివంతంగా మారుతుంది. కలబంద గుజ్జును కొద్దిగా తీసుకొని మెడపై రాసి 20 నిమిషాల పాటు ఉండాలి. ఆ తర్వాత నీటితో కడిగేయాలి. ఇలా రోజు చేస్తే నల్లబడ్డ మెడ తెల్లగా మారుతుంది. చర్మం పీహెచ్‌ స్థాయిలను సరిచేసేందుకు యాపిల్ సైడర్ వెనిగర్ ఎంతగానో పనిచేస్తుంది. ఇందులో ఉండే మాలిక్ యాసిడ్ డెడ్‌స్కిన్‌ను తొలగిస్తుంది. చర్మానికి సహజమైన మెరుపును అందిస్తుంది. రెండు టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్‌ వెనిగర్‌లో నాలుగు టేబుల్‌ స్పూన్ల నీటిని తీసుకొని బాగా కలపాలి. ఇందులో ఒక కాటన్ బాల్ ముంచి దాంతో మెడపై రాసుకోవాలి. పది నిమిషాల తర్వాత నీటితో కడిగేయాలి. రోజు ఇలా చేస్తే మెడపై నల్లధనం తగ్గుతుంది. చర్మంలో పేరుకుపోయిన మట్టి, డెడ్‌ స్కిన్, ఇతర వ్యర్థ పదార్థాలను తొలగించేందుకు బేకింగ్ సోడా అద్భుతంగా పనిచేస్తుంది. ఒక మూడు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా తీసుకొని నీటిలో కలుపుకోవాలి మెత్తగా పేస్టులా తయారు చేసుకోవాలి. దాన్ని మెడపై రాయాలి. 10 నిమిషాల తర్వాత కడిగేయాలి. తరచూ ఇలా చేస్తే సమస్య తగ్గిపోతుంది. ఆలుగడ్డలలో బ్లీచింగ్ గుణాలు అధికంగా ఉంటాయి. అందుకే చర్మాన్ని తేలిక పరుస్తాయి. మంచి టోన్‌ను అందిస్తాయి. చిన్న ఆలుగడ్డ తీసుకొని పొట్టు తీసి బాగా తురమాలి. అనంతరం ఆ మిశ్రమం నుంచి రసాన్ని తీయాలి. తర్వాత కాటన్ బాల్‌తో ఆ రసంలో ముంచి దాన్ని మెడపై రాయాలి. కొన్ని నిమిషాల పాటు అలాగే ఉంచి కడిగేసుకోవాలి. దీంతో సమస్య నుంచి బయటపడవచ్చు. రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి, అరటేబుల్ స్పూన్ నిమ్మరసం, కొద్దిగా పసుపు, రోజ్ వాటర్ కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దాన్ని మెడపై రాయాలి. 15 నిమిషాలు ఉంచుకొని కడిగేయాలి. వారంలో రెండుసార్లు ఇలా చేయడం వల్ల మన మెడపై ఉండే నలుపుదనం పోతుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News