Telangana Politics: స్థానిక సంస్థల ఎన్నికల వేళ బీఆర్ఎస్ రూటు మార్చింది. కేడర్‌ని ఉత్సాహపరిచేందుకు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ విమర్శలు ఎక్కుపెట్టింది. కేటీఆర్ చేస్తున్న కామెంట్స్‌పై రుసరుసలాడుతున్నారు. తాజాగా అలాంటి వ్యవహారం ఒకటి జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్‌రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అసలు ఈ నాయకుల మధ్య అసలు మేటరేంటి?
ఇంతకీ కేటీఆర్ ఏమన్నారు? ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. స్థానిక సమస్యలు తీర్చడానికి ప్రభుత్వం పైసలు ఇవ్వలేదని పాలమూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే పత్రికలకు ఎక్కుతున్నారని రాసుకొచ్చారు. భారీ వర్షాల వల్ల నియోజకవర్గాల్లో నష్టం జరిగితే రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని రాసుకొచ్చారు.
ఏకంగా ప్రపంచబ్యాంకుకే ఉత్తరం రాసి నవ్వుల పాలయ్యారని పేర్కొన్నారు. దీనిపై జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి కౌంటరిచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతిదీ రాజకీయం చేయొద్దన్నారు. మీ పార్టీలో ఒక్క ఎమ్మెల్యే ఏ రోజైనా తనకు సంబంధించిన విషయాలపై మాట్లాడుతారా? అంటూ కేటీఆర్‌కు సూటిగా ప్రశ్నించారు.
ప్రజలకు కావాల్సిన అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏ రోజైనా స్వేచ్ఛగా మాట్లాడారా? అంటూ నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వంలో స్వేచ్ఛ ఎక్కువన్నారు. మా ప్రభుత్వంపై ప్రజలకు చిత్తశుద్ధి ఉందన్నారు. అందుకే ఏ అంశంపైనా స్వేచ్ఛగా మాట్లాడుతారన్నారు.
ALSO READ: మొదలైన స్థానిక ఎన్నికల వేడి.. ముఖ్యనేతలతో సీఎం రేవంత్ భేటీ
నిరంకుశ పాలన మీదని, రౌడీయిజం, అరాచకత్వం చూడలేక ప్రజలు మీ పార్టీని మిమ్మల్ని బొందపెట్టారని ఎక్స్ వేదికగా స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. తాను పోరాటం చేసేది రైతుల కోసం, జడ్చర్ల నియోజకవర్గం ప్రజల కోసమన్నారు. మీ ఎమ్మెల్యేలు రౌడీయిజo చేసేది ఫ్యాక్టరీల్లో వసూళ్ల కోసం, కమీషన్ల, భూకబ్జాల కోసమనే విషయాన్ని గమనించాలన్నారు.
చెరువుల్లో చేపలు చనిపోతున్నాయని ముదిరాజుల కోసం తాను ఫైట్ చేస్తున్నానని అన్నారు. మీ మాజీల ఫ్యాక్టరీల్లో పొల్యూషన్ వచ్చినా పట్టించుకోరని, వాళ్లకు కమీషన్ ఇస్తేచాలన్నారు. ఎప్పుడూ ఈ సమస్యపై మాట్లాడలేదన్న విషయాన్ని మీరు గుర్తించాలన్నారు.
అనిరుధ్ రెడ్డి vs కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతిదీ రాజకీయం చేయొద్దని తెలిపిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
మీ పార్టీలో ఒక్క ఎమ్మెల్యే.. ఏ రోజైనా తనకు సంబంధించిన ఇష్యూపై మాట్లాడారా? అంటూ కేటీఆర్‌కు సూటి ప్రశ్న
ప్రజలకు కావాల్సిన అంశంపై బీఆర్ఎస్… pic.twitter.com/0oPEDS90Dn
— BIG TV Breaking News (@bigtvtelugu) October 1, 2025