E-Paper
Advertisement

New WhatsApp : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. రిపోర్ట్ ఆప్షన్‌తో..

New WhatsApp : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. రిపోర్ట్ ఆప్షన్‌తో..
Advertisement

సోషల్ మీడియా అనేది వచ్చిన తర్వాత ప్రైవసీ అనేది చాలావరకు తగ్గిపోయింది. ప్రైవసీ విషయంలో కాంప్రమైజ్ అవ్వము అని సోషల్ మీడియా యాప్స్ మాటిస్తున్నా కూడా యూజర్ల వివరాలు ఈజీగా బయటికి వచ్చేస్తున్నాయి. అందుకే తమకు నచ్చని విషయాలను ఓపెన్‌గా చెప్పడానికి రిపోర్ట్ అనే ఆప్షన్‌ను అంజేశాయి సోషల్ మీడియా సైట్స్. తాజాగా వాట్సాప్‌లో మరో రిపోర్ట్ ఆప్షన్‌ను కూడా యాడ్ చేసింది యాజమాన్యం.

ప్రస్తుతం ట్రెండ్‌లో అందరినీ ఆకర్షిస్తున్న సోషల్ మీడియా యాప్స్ అన్ని మెటా ఆధీనంలో ఉన్నాయి. అందులో ముఖ్యంగా మెసేజింగ్‌కు ఉపయోగపడుతున్న యాప్ వాట్సాప్. వాట్సాప్‌కు పోటీగా ఎన్నో మెసేజింగ్ యాప్స్ యూజర్లను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తుండడంతో వాట్సాప్ కూడా మరికొన్ని కొత్త ఫీచర్లను అందించడానికి సన్నాహాలు మొదలుపెట్టింది. ఎప్పటికప్పుడు వాట్సాప్ కొత్త అప్డేట్స్‌ను యూజర్లకు అందిస్తూ ముందుకెళ్తోంది.

Advertisement

తాజాగా వాట్సాప్ ప్రవేశపెట్టిన కొత్త ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ బెటాలో మాత్రమే అందుబాటులోకి రానుంది. వాట్సాప్‌లో పెట్టే స్టేటస్‌ను రిపోర్ట్ చేసే ఆప్షన్‌ను అందించనుంది వాట్సాప్. అందులో యూజర్లు పెట్టే స్టేటస్.. సూచనలను అతిక్రమించినట్టు ఉంటే రిపోర్ట్ చేసే అవకాశాన్ని అందించనుంది. ఇది నేరుగా వాట్సాప్ మ్యానేజ్మెంట్‌‌కు పంపించే అవకాశాన్ని అందిస్తుంది. అంతే కాకుండా ప్రైవసీ విషయంలో కూడా మరికొన్ని మార్పులు చేయడానికి వాట్సాప్ సిద్ధమయ్యింది.

వాట్సాప్‌లో పంపించుకునే మెసేజ్‌లు, లొకేషన్స్, కాల్స్, స్టేటస్ విషయంలో ఎంక్రిప్షన్‌ను మరింత కఠినంగా చేయాలని వాట్సాప్ నిర్ణయించుకుంది. అంటే వాట్సాప్ మేనేజ్మెంట్, మెటా కూడా వాటిని చదవడానికి వీలు లేకుండా చేయనుంది. కాల్స్, మెసేజ్‌ల విషయంలో పూర్తిస్థాయి ప్రైవసీ ఉండాలని వాట్సాప్ ప్రయత్నాలు చేయనుంది. ఈ కొత్త ఫీచర్‌తో యూజర్లకు వాట్సాప్‌పై మరింత నమ్మకం పెరగనుంది. జనవరి నుండి ఈ కొత్త ఫీచర్లపై టెస్టింగ్ ప్రారంభించిన వాట్సాప్.. త్వరలోనే వీటిని యూజర్లకు అందించనుంది.

Tags

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×