Srisailam : శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లంగ క్షేత్రాల్లో ఒకటి. మహిమాన్వితమైన ఈ క్షేత్రంలో ఎప్పుడు వెలిసిందనడానికి కచ్చితమైన చారిత్రక ఆధారాలు లేవు.క్రీస్తు పూర్వం అనేక రాజవంశాలు శ్ర్రీశైలాన్ని సేవించినట్టు శిలాశాసనాలు, ఇతర చారిత్రక సాక్ష్యాలు చెబుతున్నాయి. శాతవాహనులు, చాళుక్యులు, కాకతీయులు, రెడ్డిరాజులు , విజయనగర సామ్రాజ్యధీశులు ఎంతో మంతి భ్రమరాంబికా సమేతుడైన మల్లిఖార్జున్ని దర్శించుకుని ఆలయ ప్రాకారాలు, నిర్మించి అశేష వస్తు సంపదనలు సమర్పించినట్టు ఆధారాలున్నాయి. శ్రీశైలం గురించి ఎంతో అంతు చిక్కని రహస్యాలు ఉన్నాయి. ఇక్కడపాతాళ గంగలోకి నీరు వచ్చి చేరుతందనేది ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్న. అందులోను పాతాళ గంగలో నీరు అంతా పచ్చగా ఎందుకు ఉంటుందో ఆ నీరు ఎలా చేరుతుందో సమాధానం లేని ప్రశ్నలు.
చంద్రగుప్త మహారాజు అనేక సంవత్సరాలు యుద్ధచేసి, విజయాలతో రాజ్యం చేరతాడు. అంతఃపురంలోని స్త్రీలతో ఉన్న అందాల రాశినితన కూతురని తెలియక ఆశిస్తాడు.చంద్రావతిని శ్రీశైలం అరణ్యాలకి వచ్చి పరమేశ్వరుడ్ని అనుగ్రహించమని తపస్సు చేస్తుంది. అక్కడికి కూడ చంద్రగుప్తుడు వచ్చి చంద్రావతిని చెరపట్టబోతుండగా మహాశివుడు ప్రత్యక్షమై కామంతో కనులు మూసుకుపోయిన నీవు పచ్చలబండవై పాతాళగంగలో పడి ఉండమని శపిస్తాడు. తన తప్పుని మన్నించని వేడుకోగా, శ్రీమహావిష్ణువు కలియుగంలో అవతరిస్తాడు. ఆ అవతార పురుషుడు స్నానంకై పాతాళగంగలో దిగిననాడు, స్నానమాచిరించిన నాడు నీకు శాపవిమోచనం కలుగుతుందని మహేశ్వరుడు శెలవిస్తాడు