Karimnagar Crimes : కరీంనగర్ జిల్లా జమ్మిగుంటలో దారుణం చోటుచేసుకుంది. మద్యం షాపులో ఓ వ్యక్తిని ఇద్దరు వ్యక్తులు కిరాతకంగా హతమార్చారు. గొంతు కోసి చంపేశారు . హత్యకు గురైన వ్యక్తిని మంద సంతోష్ గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు….హత్య చేసిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితులిద్దర్నీ జేడీ, శివకృష్ణగా గుర్తించారు.